15-11-2025 07:51:58 PM
కోదాడ,(నడిగూడెం): నిబంధనలను అతిక్రమించి ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకొని, వాహనాలను సీజ్ చేస్తామని యస్ఐ జి అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఎరైవ్-ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు శనివారం నడిగూడెం మండల కేంద్రంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా యస్ఐ మాట్లాడుతూ... నిబంధనల మేరకు ప్రయాణికులను ఎక్కించుకొని సురక్షితమైన ప్రయాణం చేయాలని, నిబంధనలు అతిక్రమించి పరిమతి దాటి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి ప్రమాదాలకు ఆటో డ్రైవర్లే బాధ్యత వహించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, ప్రాణ నష్టాలు జరగకుండా ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలు నలపాలని డ్రైవర్లకు సూచించారు. అనంతరం ఎరైవ్-ఎలైవ్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు,ప్రయాణికులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.