07-11-2025 12:31:47 AM
-రోడ్డు విస్తరణతో చిరు వ్యాపారుల బతుకులు ఆగం
-పునరావాసం కల్పిస్తామంటున్న అధికారులు
బెల్లంపల్లి, నవంబర్ 6 : బెల్లంపల్లి పట్టణం లో రోడ్డు విస్తరణ పనులతో చిరు వ్యాపారు లు రోడ్డున పడ్డారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా చిన్న వ్యాపార స్తులపై మున్సిపల్ అధికారులు ఉక్కు పాదం మోపి కూల్చివేతలకు దిగడంతో వ్యాపారులు నిరాశ్రయులుగా మారిపోయారు. పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి నుండి మొ దలుకొని కాంటా (అంబేద్కర్ చౌరస్తా) వరకు మూడు దశల్లో వంద ఫీట్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఇందుకుగాను టియుఎఫ్‌ఐడియుసి కింద రూ. 9.70 కోట్ల నిధులతో ఈ పనులను చేపట్టనున్నారు. సింగరేణి ప్రధాన ఏరియా ఆసుపత్రి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు రూ. 2 కోట్లు, మున్సిపల్ కార్యాలయం నుంచి ఏఎంసి చౌరస్తా వరకు రూ 2. కోట్లు , ఏఎంసి చౌరస్తా నుంచి కాంటా అంబేద్కర్ చౌరస్తా వరకు రూ. 2 కోట్లు మంజూరు కాగా రూ 3.70 కోట్లు చౌరస్తా వెడల్పు కోసం ఖర్చు చేయనున్నారు. గత నెల 31న ఒక్కసారిగా రోడ్లపై చిరు వ్యాపారుల చిన్నపాటి షెడ్లు, దుకాణాలను నిర్దాక్షి ణ్యంగా జెసిబిల సహాయంతో కూల్చివేతలు ప్రారంభించారు. దీనితో రోడ్డుపైనే ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు నిరాశ్రయులుగా మారి రోడ్డున పడ్డారు.
చిరు వ్యాపారుల బతుకులు ఆగం
మున్సిపల్ అధికారులు మొదట ఏఎంసి ఏరియాలోని నెంబర్ 2 గ్రౌండ్ నుంచి రోడ్డు కు రెండు వైపులా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయం, ఏఎంసి ప్రాంతంలోని చిరు వ్యాపారుల షెడ్లు, సిఎస్‌ఐ పాఠశాలల ప్రహరీ గోడలు, రామాలయం ఏరియాలోని సింగరేణి క్వార్టర్లు కొంత భాగం, మున్సిపల్ ఏర్పా టుచేసిన చేపల మార్కెట్ షెడ్లు, రోడ్లపై ఏర్పా టు చేసిన పండ్ల దుకాణాలు, తోపుడు బండ్లు కూల్చివేతల్లో నేలమట్టమయ్యాయి.
ఈనెల 1న నూతన కూరగాయల మార్కెట్ భవనం ఎదుట కోళ్ల వ్యాపారాల తాత్కాలిక షెడ్లతో పాటు చిన్నపాటి కిరాణం దుకాణాలు, కాంటా చౌరస్తా ప్రాంతంలో పాంటేలాలు, టీ స్టాళ్లు, చిన్నపాటి వ్యాపారస్తుల దుకాణాలను పోలీ సు బందోబస్తు మధ్య నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు. దీంతో వ్యాపారస్తులు మున్సిపల్ అధి కారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని కొంతమంది చిరు వ్యాపారస్తులు ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు ఆందోళన చేపట్టిన చిరు వ్యాపారస్తులను పోలీస్ స్టేషన్ కు తరలించి బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. అభివృద్ధి కోసం చేపడుతున్న ఈ రోడ్డు విస్తరణ పనుల వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు.
ఎమ్మెల్యే స్పందించి ఆదుకోవాలి
బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ కారణంగా నష్టపోయిన చిరు వ్యాపారులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి ఆదుకోవాలి. నష్టపోయిన వ్యా పారులకు ప్రభుత్వం మళ్లీ ఉపాధి చూపించాలి. దుకాణాలు కోల్పోయిన చిరు వ్యాపారుల వివరాలు సేకరించి రోడ్డు పూర్తయ్యాక పునరావాసం కల్పించాలని సబ్ కలెక్టర్ ఆదేశిస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. విస్తరణ తర్వాత ఇదే రోడ్డుపై ఉపాధి చూపించి తమను ఆదుకోవాలి.
సజ్ను షఫీ, పాన్ షాప్ నిర్వాహకులు
రోడ్డుపైనే ఉపాధి చూపాలి...
30 ఏళ్లుగా చేపలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తు న్న. కూరగాయల మార్కెట్ నిర్మాణంతో ఉపాధి కోల్పో యా.మున్సిపాలిటీ నిర్మించిన షెడ్డులో నెలకిరూ. 1000 అద్దె చెల్లిస్తూ చేపలు అమ్ముకుంటున్న. రోడ్డు విస్తరణ అంటూ ఒక్కసారిగా షెడ్లు కూల్చివేయడంతో రోడ్డున పడ్డ. నష్టపోయిన చిరు వ్యాపారులకు సిఎస్పి బంకర్ వద్ద పునరావసం కల్పిస్తామని చెబుతున్నారు. అక్కడ వ్యాపారాలు సాగవు. అధికారులు పెద్ద మనసుతో ఇదే రోడ్డుపై చిరు వ్యాపారులమైన తమకు ఉపాధి చూపాలి.
బాబా, చేపల వ్యాపారి
ఉపాధి కోల్పోయాం...
ఒక్కసారిగా కూల్చివేతలు చేపట్టడంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాం. పండ్ల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న మాకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. సమాచారం లేకుండా మా షెడ్లను కూల్ చేయడంతో నష్టపోయాం. అధికారులు పునరావసం కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాం.
కోట కిరణ్, పండ్ల వ్యాపారి
ఆందోళన చెందొద్దు..
రోడ్డు విస్తరణలో దుకాణాలు, షెడ్లు కోల్పోయిన చిరు వ్యాపారులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. నష్టపోయిన చిరు వ్యాపారుల వివరాలు సేకరిస్తాం. బంకర్ ప్రాంతంలో వ్యాపారులకు మళ్లీ ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. ఎవరికి అన్యాయం జరగకుండా వ్యాపారులకు అన్ని ఏర్పాట్లు ఉండేలా సిద్ధం చేస్తాం.
తన్నీరు రమేష్, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్