07-11-2025 12:42:16 AM
-రెండేళ్లుగా సాగుతున్న పనులు
- నిబంధనకు విరుద్ధంగా అక్రమ తోలకాలు
- అక్రమ తోలకాలను అడ్డుకుంటున్న స్థానికులు
వెంకటాపురం(నూగూరు), నవంబర్6(విజయక్రాంతి):ములుగు జిల్లా వెంకటపురం మండల కేంద్రం సమీపంలోని కంకల వాగు పై మల్లాపురం మార్గంలో వంతెన నిర్మాణం పట్ల కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెండు సంవ త్సరాల క్రితం ప్రారంభమైన ఈవంత నిర్మా ణం పూర్తి కావడం పట్ల అటువైపుగా ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మండల కేంద్రం నుంచి నిత్యం వందల సంఖ్యలో ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే రైతులు కూలీలు ఈ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇ బ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంత నిధులతో చేపట్టిన రూ. 4 కోట్ల11 లక్షల నిధులు మంజూరు కాగా రెండు సంవత్సరాల క్రితం ఈ వంతెన నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సగంలోనే పనులను నిలిపివేశాడు. ప్రస్తుతం వంతెన నిర్మా ణం పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయింది. గతంలో ఇక్కడ పనులు నిర్వహించిన సమయంలో సదరు కాంట్రాక్టర్ ఇసుక గ్రావెల్ మట్టి తోలకాల విషయంలో నిబంధనలు పాటించకపోవడంతో పలు దఫాలు రెవె న్యూ అధికారులు అక్కడ నిల్వమించిన ఇసుకను సీజ్ చేశారు.
ఆ వంకతో అప్పుడు ప నులు నిలిపివేసిన కాంట్రాక్టర్ సుమారు ఆరు నెలలు ఈ వంతెన నిర్మాణం పట్ల శ్రద్ధ చూపలేదు. వారం రోజుల క్రితం మళ్లీ నిర్మా ణ పనులు చేపట్టడానికి వచ్చిన సదరు కాం ట్రాక్టర్ వచ్చిన వెంటనే వంతెన నిర్మాణానికి అవసరమైన ఇసుక మట్టి తరలింపుల విషయంలో మళ్లీ నిబంధనలు పాటించ లేదు. కొందరు అధికారులతో ముందస్తుగా మా ట్లాడుకొని వెంకటాపురం సమీపంలోని చొక్కాల గ్రామ శివారులోని గోదావరిలో పట్టపగలే జెసిబి సహాయంతో ఇసుకనుతోడి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించాడు. విషయం తెలుసుకున్న కొందరు వ్యక్తులు బ హిరంగంగా అక్రమంగా ఇసుక తరలింపు వ్యవహారాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు వెళ్లి ఆరు ట్రాక్టర్లతో పాటు జెసిబి ని సీజ్ చేశారు.
ఈ వంకతో సదర్ కాంట్రాక్టర్ మళ్ళీ పనులను వారం రో జులుగా నిలిపివేశాడు. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో ఆ మార్గంలోని మల్లాపురం కరివాని గొప్ప రాచపల్లి గ్రామాలకు చెందిన గిరిజనులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఈవంతర నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో అటువైపుగా నిత్యం వెళ్లే రైతు లు వ్యవసాయ కూలీలు వెంకటాపురం సమీపంలోని చొక్కాల గ్రామం మీదుగా చుట్టూ తిరిగి తమ వ్యవసాయ పనులకు వెళ్తూ తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాం తంలో అభివృద్ధిలో భాగంగా జరిగే వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం లో కొందరు స్థానికులు సైతం ఇబ్బందులను సృష్టిస్తున్నారని కాంట్రాక్టర్ తరపు సూపర్వైజర్లు వా పోతున్నారు.
ప్రతి పనిని అడ్డుకుంటూ స్థానికులు కొందరు అభివృద్ధి నిరోధకులుగా మారారని వారు వాపోతున్నారు. మూడు గ్రామాల ప్రజలు ఈ వంతెన నిర్మాణం పూ ర్తయితే తమ గ్రామాలకు పూర్తిస్థాయి రవా ణా సౌకర్యం పెరుగుతుందని ఆశించగా పనులను అడ్డుకుంటున్న వారితో నిర్మాణం ఆలస్యం కావడంతో గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిబంధనలు పాటించి చట్టబద్ధంగా ఇసుక మట్టిని తరలించవలసిన సదరు కాంట్రాక్టర్ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమకేది కాదన్నట్లు అక్రమ తరలింపు లకు పాల్పడుతూ ఉండడంతో వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. అధికారులు ఇకనైనా స్పందించి పంతులు నిర్మా ణాన్ని వేగవంతంగా జరిపేలా చర్యలు తీసుకొని ఆ ప్రాంత గిరిజనుల ఇబ్బందులను తొలగించాలని, రైతులు, వ్యవసాయ కూలీల బాధను అర్థం చేసుకోవాలని వారు కోరుతున్నారు.