01-09-2025 01:31:38 AM
-సెయింట్ సాయి టీంపై ‘సన్‌గ్రేస్’ ఘన విజయం
-109 పరుగులు బాదిన సన్‌గ్రేస్ ఆటగాడు బిపిన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో ఆదివారం సైనిక్‌పురిలోని భవన్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఒకరోజు సీ డివిజన్ లీగ్ నిర్వహించారు. ఈ లీగ్‌లో సన్‌గ్రేస్ టీం, సెయింట్ సాయి టీంలు తలపడగా.. సన్‌గ్రేస్ టీం విజయం సాధించింది.
సన్‌గ్రేస్ టీం 48 ఓవర్లలో మూడు వికెట్ల నష్టపోయి 333 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన సెయింట్ సాయి టీం 33.1 ఓవర్లలో 97 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. సన్‌గ్రేస్ టీం తరఫున ఆడిన బత్తిని బిపిన్ కుమార్ 109 పరుగులు సాధించి జట్టును విజయం వైపు నడిపించాడు.