19-12-2025 12:00:00 AM
పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
చర్ల, డిసెంబర్ 18 (విజయక్రాంతి): చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పరిధిలోని గొండిగూడలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు. సుక్మా జిల్లా గోలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొండిగూడ అటవీ కొండలలో మావోయిస్టుల ఉనికి గురించి విశ్వసనీయ సమాచారం ఆధారంగా, సుక్మా డిఆర్జి బృందం శోధన ఆపరేషన్ ప్రారంభించిందని సుక్మా ఎస్పీ శ్రీ కిరణ్ చవాన్ తెలియ జేశారు.
గురువారం ఉదయం నుంచి గొండిగూడ అటవీ కొండలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మా వోయిస్టులు మృతిచెందారు. మరణించిన వారిలో మద్వి జోగా అలియాస్ మూన్నా (రివార్డ్ ఐదు లక్షలు), సోడి బండి (రివార్డ్ రూ.ఐదు లక్షలు), నుప్పోన్ బజాని (రివార్డ్ రూ.2 లక్షలు)గా గుర్తించారు. ఎన్ కౌంటర్ స్థలం వద్ద 9 ఎంఎం సర్వీస్ పిస్టల్, 12 బోర్, భార్మర్ గన్, భారీ మొ త్తంలో పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరు కొంటా, కిస్తారామ్ ఏరియా కమిటీలో చురుగ్గా పనిచేశారని, పలు పోలీస్ కేసుల్లో ప్రమేయం ఉన్నదని తెలిసింది.