19-12-2025 12:00:00 AM
తక్షణం పదవికి రాజీనామా చెయ్యి
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫైర్
మహబూబాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): రాజకీయ పబ్బం కడుపుకోవడానికి, నీతి మారిన విధంగా రాజకీయాలు చేస్తూ, రాజ్యాంగ వ్యవస్థను, రాజకీయ, ప్రజాస్వామ్య వ్యవస్థలను అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రవర్తిస్తున్న స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. ఏ ము ఖంతో స్టేషన్‌ఘనపూర్ వస్తాడని మాజీ ఎమ్మె ల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజ య్య ప్రశ్నించారు. తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఆయనను అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తానే ప్రకటించుకొని, ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్‌కు తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు అఫిడవిట్ ద్వారా తెలియజేసినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కడియం శ్రీహరి వ్యవహార శైలి సరైంది కాదంటూ విమర్శించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకుల కష్టంతో స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యేగా గెలిచి, వారిని నట్టేట ముంచి తన రాజకీయ ప్రయోజనాల కోసం, పార్లమెంట్ సీట్ కోసం కాంగ్రెస్ పార్టీతో అంట కాగి, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకు కెసిఆర్, కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శించాడన్నారు.
ఇప్పు డు తాను ఎటువైపు ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిలో కడియం శ్రీహరి వ్యవహార శైలి ఉంద ని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నేతగా కడియం శ్రీహరి వ్యవహరించడం లేదని, నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాలనుండి వైదొ లిగే దశలో ఉన్న కడియం శ్రీహరి ప్రవర్తన అసహ్యంగా ఉందన్నారు. రాజకీయ వ్యభిచారిగా మా రాడని, ఇప్పటికైనా స్టేషన్ ఘనపూర్ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, పదవిని పట్టుకొని వేలాడితే ప్రజలు ఛీత్కారిస్తారని హెచ్చరించారు.