calender_icon.png 18 January, 2026 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం

18-01-2026 01:17:08 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, జనవరి 18 (విజయక్రాంతి): విద్యార్థి దశ నుంచే క్రీడలకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రోత్సా హం అందిస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవా ల్, ఎస్పీ మహేష్ బిగితేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..  సీఎం కప్ పేరిట రాష్ట్రంలోని గ్రామ స్థాయి నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీసి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.

జిల్లాలోని విద్యార్థులు, యువత సీఎం కప్ పోటీల్లో పాల్గొని ఎక్కువ సంఖ్యలో పతకాలు సాధించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మొత్తం 34 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపరెడ్డి, యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.