calender_icon.png 11 May, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిందూర్‌తో రక్తధారకు ముగింపు!

10-05-2025 01:55:47 AM

ద్వేషభావాలు లేకుండా ఎంతో సహనంతో ఉన్న భారత్‌ను రె చ్చగొట్టి చావుదెబ్బ తింటున్నది పాకిస్థాన్.  కశ్మీర్‌పై కుట్రలతో భారత్‌ను దీర్ఘకాలికం గా వేధిస్తూ ఆ దేశం తన వినాశనాన్ని కొనితెచ్చుకుంది. సహనం నశిస్తే సమాధానం ఎలా ఉంటుందో భారత్ చేపట్టిన ఆపరేష న్ సిందూర్‌తో పాక్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూ, ఎవరైనా చొరవ తీసుకొని రక్షిస్తారని ఎదురుచూస్తుంది.

పలు మార్లు భారత్ చేతిలో ఘోర పరాజయా లు పొందినా తీరులో మార్పు రాకపోవడంతో ఇప్పుడు పాక్‌ను కోలుకోకుండా దెబ్బకొట్టాలని, ఆపరేషన్ సిందూర్ ఒక సదవకాశమని, దీన్ని సద్వినియోగపర్చు కోవాలనే భావన దేశంలో సర్వత్రా వ్యక్తమవుతోంది. 

దేశ భద్రతకు భారత్ పెద్దపీట వేస్తూ బడ్జెట్‌లో రక్షణకోసం రూ.6.8 కోట్లు కేటాయిస్తే, ప్రత్యర్థి పాకిస్థాన్ రక్షణ బడ్జెట్ మన కరెన్సీల్లో లెక్కిస్తే లక్ష కోట్ల రూపాయలు మాత్రమే. సైన్యం, వైమానికం, నౌకాదళం, క్షిపణులతోపాటు అనేక అత్యాధునిక ఆ యుధాలలో కూడా పాక్‌పై భారత్‌దే పై చేయి.

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ ప్రయోగించిన ఆయుధాలను పాకిస్థాన్‌తోపాటు వారికి ఆపన్నహస్తం అం దించే చైనా రాడార్లు కూడా గుర్తించడంలో విఫలమయ్యాయి. దీంతో పాకిస్థాన్‌లో ఆందోళన రెట్టింపయ్యింది. చైనా సరఫరా చేసిన యుద్ధ సామాగ్రిని చూసుకొని భారత్‌పై కాళ్లు దువ్విన పాకిస్థాన్‌కు రాడార్ల వైఫల్యంతో చైనాను నమ్ముకొని మునిగిపోయామని, రానున్న రోజుల్లో ఎటాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయం వెంటాడుతోంది.

గత యుద్ధాలకు భిన్నంగా!

ఆర్థిక పరంగాను, ఆయుధాల పరంగా ను, సైనిక పరంగాను ఇలా అన్ని రంగాల్లో భారత్‌కంటే వెనుకబడి ఉన్నామనే వాస్తవ పరిస్థితులు తెలిసినా పాకిస్థాన్ దీర్ఘకాలికంగా భారత్‌ను చికాకు పరుస్తూనే ఉంది. దేశ విభజన అనంతరం కశ్మీర్ సాకుతో భారత్‌పై నిత్యం పాకిస్థాన్ కుట్రలు పన్ను తూ భంగ పడుతూనే ఉంది.

1947, 1965, 1971, 1991లలో జరిగిన యుద్ధా ల్లో భారత్ చేతిలో పరాజచయాల పాలైనా పాకిస్థాన్‌లో మార్పు రాలేదు. భారత్ చేతిలో అరడజనుకుపైగా దాడులు ఎదుర్కొన్నా పాకిస్థాన్ తీరులో మార్పు రాకపో వడంతో రెండు దేశాలమధ్య మరోసారి ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది.

దేశ స్వాతంత్య్రం అనంతరం కశ్మీర్ ప్రాంతం భారతదేశంలో విలీనమైనప్పటి నుంచీ కుట్రలు పన్నుతున్న పాకిస్థాన్ ప్ర కృతి అందాలకు నెలవైన జమ్ముకశ్మీర్‌ను అస్థిర పరిచేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. యుద్ధంలో భారత్ బలగాలను ఎదుర్కోలేమని బోధ పడడంతో మన దేశంలో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి నరమేధాల్ని సృష్టిస్తోంది.

జమ్ముకశ్మీర్‌ను ఉగ్ర వాదులకు అడ్డాగా మార్చడమేకాక దేశంలోని ఇతర నగరాలు, ప్రాంతాల్లోనూ బాంబు దాడులను ప్రోత్సహించింది. దే శంలో 90వ దశకంలో ప్రారంభమైన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా భూతల స్వర్గమైన కశ్మీర్‌ను పాకిస్థాన్ దొం గదెబ్బలతో దశాబ్దాలుగా రక్తసిక్తం చేస్తోం ది.

2000 నుంచి ప్రస్తుతం పహల్గాం వరకు జరిగిన ఉగ్రదాడుల్లో 700 మందికిపైగా భద్రతా సిబ్బంది, పౌరులు బల య్యారు. ప్రతి దాడి వెనుక పాకిస్థాన్ హ స్తం ఉందని రూఢీ అయినా 2016, 2019 దాడులను మినహాయించి మిగతా సందర్భాల్లో భారత్ ఎంతో సహనంతో వ్యవ హరించింది.

ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు టెర్రరిస్టులను ఏరి వేయడానికే ప్రాధాన్యమిచ్చారు. కశ్మీర్‌లో 2016లో ఉరీలో సైనిక క్యాంపుపై, 2019 లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడి జరి గినప్పుడు భారత్ సైన్యం మెరుపుదాడులతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాల ను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంది.

వేలెత్తి చూపే అవకాశమే లేకుండా!

ఉగ్రవాదుల దాడులకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్‌ని ప్రారంభించిన భారత్ 2016, 2019లో భద్రతాదళాలపై దాడి జరిగినప్పుడు మాత్రమే పాకిస్థాన్‌పై మెరుపుదాడులు చేసింది. ఇప్పుడు పహల్గాంలో మాత్రం పర్యాటకులపై కాల్పులు జరిపిన నేపథ్యంలో భారత్ తీవ్రంగా ప్రతిస్పందించడంలో న్యాయం ఉంది.

పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరుతో కాల్పులు జరిపి మన దేశంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు యత్నించారు. మరోవైపు ఆర్టిక ల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో సా ధారణ పరిస్థితులు నెలకొనడంతో అసెం బ్లీ ఎన్నికలూ ప్రశాంత వాతావరణంలో జరగడం పాకిస్థాన్‌కు కంటగింపుగా మారింది. గత సంవత్సరం జమ్ముకశ్మీర్ లో 2.30 కోట్లమంది పర్యాటకులు పర్యటించడంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

దీంతో కశ్మీర్‌లో ఇకపై తమ పాచికలు పారవని తెలిసొచ్చిన పాక్ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని భారతీయు ల్లో భయభ్రాంతులు సృష్టించి భారత ప్రభుత్వానికి సవాలు విసిరింది. ఆ సవాలును సీరియస్‌గా స్వీకరించిన భారత్ సిందూర్ పేరిట గట్టి జవాబిచ్చింది.

పహల్గాం ఘటన అనంతరం భారత్, పాక్‌పై దాడి చేస్తుందనేలా యుద్ధ వాతావరణం ఏర్పడడంతో పాకిస్థాన్ మనకంటే ముందస్తుగా సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు, భద్రతా ఏర్పాట్లు చేసింది. తాము కూడా యుద్ధ సన్నాహాలు ప్రారంభిస్తున్నట్టు ఏప్రిల్ 7న దేశవ్యాప్తంగా మాక్‌డ్రి ల్స్ ఏర్పాటు చేయడంతో, దీని అనంతరమే ఏదో జరగనుందనే భావన ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడింది.

దాయాది పాకిస్థాన్ కూడా ఏదైనా జరిగితే ఏప్రిల్ 7 తర్వాతే  అనే నమ్మకంతో ఉంది. అయితే, అందరి ఊహలకు భిన్నంగా భారత ప్రభుత్వం 6 నాటి అర్థరాత్రి ఒంటిగంట తర్వాత మెరుపుదాడులతో పీఓకేలో ఐదు, పాక్‌లో నాలుగు ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా తొమ్మిది దాడులు జరపడంతో తెల్లారేసరికి ప్రపంచం నివ్వరపోయింది.

1971 తర్వాత ఇప్పుడు ఒకేసారి త్రివిధ దళాల సహకారంతో భారత్ సైన్యం దాడులు చేసింది. సాధారణ పౌరులపై, సైనికులపై కాకుండా, మన దేశ భద్రతకు సవాలు విసిరిన ఉగ్రవాదుల స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని సర్జికల్ స్ట్రైక్స్ చేయడంతో పాకిస్థాన్ సహా ఎవరూ భారత్‌పై వేలెత్తి చూపే అవకాశం లేకుండా పోయింది.

ఇప్పటికైనా బుద్ధి చెప్పాల్సిందే!

ఆపరేషన్ సిందూర్ అంతర్గత భద్రతా చర్యలను పటిష్ట పర్చుకోవడం కోసమేకాక దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా చేపట్టిందని భారత్ ప్ర పంచంలోని పలు దేశాలకు వివరించింది.

ఐక్యరాజ్యసమితి ఆర్టికల్ 51 ప్రకారం ఏ దేశమైనా తన భద్రత కోసం తగిన చర్యలు తీసుకునే హక్కు ఉంటుందనే భారత్ వాదనకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోం ది. టెర్రరిస్టులకు స్వర్గసీమ అయిన పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలు ఆశ్రయం పొందుతూ ప్రపంచవ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. అందులో భారత్ అత్యంత బాధిత దేశం.

అందుకే ఉగ్రవాదుల లక్ష్యం గా భారత్ చేసిన దాడులకు ఇతర దేశాల నుంచి సానుకూలత ఏర్పడింది. అదే సమయంలో పాకిస్థాన్‌కు మద్దతు కొరవడింది. చైనా సహకారం ఉంటుందనే ఆశతో పాకిస్థాన్ ఉన్నా అదికూడా ఆచితూచి వ్యవహ రిస్తూంది. అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుందని పాక్ భావిస్తున్నా తగిన స్పందన రావడం లేదు.

భారత్ చేసే దాడులతోనే కాకుండా బలూచిస్థాన్‌లో, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో జరుగుతున్న అంతర్గత  అల్లర్లతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్ మనతో సుదీర్ఘకాలం పోరాడే అవకాశాలు లేకపోవడంతో సిందూర్ సమరానికి భారత్ వీలైనంత త్వరగానే ముగింపు పలకవచ్చు.

పాకిస్థాన్ చేతిలో ఇప్పటికే పలు దఫాలుగా సమస్యలు ఎదుర్కొన్న భారత్ సిం దూర్ ఆపరేషన్‌ను సద్వినియోగపర్చుకొని భవిష్యత్‌లో ఆ దేశానికి మరోసారి ఎలాం టి ఆస్కారాలు ఇవ్వకుండా బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అవసరమైతే పీఓకే లోకి చొచ్చుకొనిపోయి అక్కడున్న ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టాలి. భారత దేశంలో ఉగ్రవాదుల రక్తధార, రక్తదాహానికి ముగింపు పలికేలా ఆపరేషన్ సిందూర్ దాడులు ఉండాలని పౌరులు కోరుకుంటున్నారు.