calender_icon.png 12 May, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైదంబండలో విషాదం

11-05-2025 11:23:18 PM

ట్రాక్టర్ ఆపబోయి యువకుడు మృతి

ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని మైదంబండ గ్రామం ఆదివారం విషాదం నెలకొంది. గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ట్రాక్టర్ లో వరి ధాన్యం లోడ్ చేస్తున్న క్రమంలో ట్రాక్టర్ కదలగా.. అక్కడే ఉన్న పందుల మహేందర్ అనే యువకుడు (17) ఆపే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారీ కింద పడ్డాడు. దీంతో అతనిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుడి సోదరుడు శ్రావణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తారం ఎస్ఐ గోపతి నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.