calender_icon.png 22 September, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంగిలిపూల బతుకమ్మ మా ఊరుకొచ్చేనమ్మ..

22-09-2025 12:00:00 AM

మంగపేట,సెప్టెంబరు 21 (విజయక్రాంతి): బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఎంగిలిపూల బతుకమ్మ ఉయ్యాలో మన ఊరుకొచ్చేనమ్మ ఉయ్యాలో అంటూ పాటలతో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు ఆదివారం మండలంలోని ప్రతి గ్రామంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూలను పూజించే సంస్కృతి సాంప్రదాయాల నడుమ ఎంగిలిపూలబతుకుమ్మ సంబరాలలో మహిళలు ఆటపాటలతో అలరించారు.

ఈ సందర్భంగా కమలాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన మహిళల పండుగ ఇది పూలను పూలతో పూజించే సాంప్రదాయం మనదని అన్నారు.

బతుకమ్మ వేడుకల్లో ఎంపీ కడియం కావ్య 

హనుమకొండ, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): బతుకమ్మ వేడుకల సందర్భంగా హనుమకొండ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తన ఇంట్లో తీరక్క పూలు తెచ్చి ఎంగిలిపూల బతుకమ్మను పేర్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ బతుకమ్మను అందమైన ఆకృతిలో పేర్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి  ప్రతీక అని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని బతుకమ్మ పండుగ ప్రతిబింబిస్తుందన్నారు. రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలు ప్రకృతి అందాలు దాగి ఉంటాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

తీరొక్క పూలతో .. బతుకమ్మ వేడుకలు 

మహబూబాబాద్, (విజయక్రాంతి): బతుకమ్మ వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా ప్రారంభించారు. తీరొక్క పూలు తెచ్చి ఎంగిలిపూల బతుకమ్మలను ఉదయం నుంచే పేర్చడం ప్రారంభించారు. ఎంగిలిపూల బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయానికి చెందిన బతుకమ్మ పండుగలో భాగం.  

రేగొండ..

రేగొండ సెప్టెంబర్ 21(విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంగ రంగ వైభవంగా ప్రారంభయ్యాయి.తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు మండల వ్యాప్తంగా మహిళల ఆటపాటలతో ఆనంద భరితంగా జరిగాయి. ఈ క్రమంలోనే రేగొండ మండలంలోని  తిరుమలగిరి గ్రామంలో భూలక్ష్మి దగ్గర మహిళలంతా ఎంగిలిపూల బతుకమ్మను రకరకాల పూలతో అందంగా పేర్చుకొని వచ్చి బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు.బతుకమ్మ వేడుకలను చిన్నారులు, మహిళలు కోలాట పాటలతో సందడిగా జరుపుకున్నారు.