22-09-2025 12:00:00 AM
పెద్దపల్లి, సెప్టెంబర్ 21(విజయక్రాంతి)ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు ను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆదివారం పరామర్శించారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మాతృమూర్తి ప్రేమలత ఇటీవల మృతి చెందగా వారి నివాసానికి వెళ్ళి ప్రేమలత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు ను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.