calender_icon.png 16 September, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతంలో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు

16-09-2025 12:11:10 AM

పటాన్చెరు, సెప్టెంబర్ 15 :గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కోగన్, గిట్ హబ్ కమ్యూనిటీ, ఇన్నోవేషన్ సెంటర్, కాడ్ ఏఐ విద్యార్థి విభాగాలు (క్లబ్ లు) సోమవారం ఇంజనీర్స్ డే వేడుకలను సంయుక్తంగా నిర్వహించాయి. అభ్యాసం, ఆవిష్కరణ, వినోదాల మేలు కలయిగా సాగిన ఈ ఉత్సవాలను వర్ధమాన ఇంజనీర్లను ప్రేరేపించేలా నిర్వహించారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు పుష్పగుచ్చాలు సమర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ వేడుకలలో భాగంగా, ఆయా క్లబ్ లు ఇంజనీర్స్ ఎక్స్ పోను నిర్వహించి, గీతం హైదరాబాదు ప్రాంగణంలోని విద్యార్థుల నుంచి వినూత్న ప్రాజెక్టులు, సృజనాత్మక ఆలోచనలను విజయవంతంగా ప్రదర్శించారు. అధునాతన సాంకేతికతలను తెలుసుకోవడానికి, విద్యార్థి ఆవిష్కర్తలతో సంభాషించడానికి, వారి చాతుర్యం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఎక్స్ పో ఒక వేదికను అందించింది. ఈ వేడుకలలో భాగంగా, ఎల్‌ఎస్‌ఈజీ (ఎల్ ఎస్ ఈ జి)లో లీడ్ ఇంజనీర్ ఖాజా మొయినుద్దీన్ మొహమ్మద్ ‘క్యాంపస్ నుంచి కార్పొరేట్ వరకు’ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఆయన ప్రసంగంలో, కార్యాలయ సంసిద్ధత, కెరీర్ వృద్ధి, కళాశాల జీవితం నుంచి కార్పొరేట్ ప్రపంచానికి విజయవంతంగా మారడంపై విలువైన అంతర్దృష్టులను పంచుకున్నారు.