16-09-2025 12:12:26 AM
జిన్నారం(పటాన్చెరు), సెప్టెంబర్ 15 :జిన్నారం పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట వికలాంగులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు కంది ప్రవీణ్ ఆధ్వర్యంలో వికలాంగులు ఈ ఆందోళన చేపట్టారు. వికలాంగులకు రూ .6వేలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు రూ.4వేలు, కండర క్షీణిత బాధితులకు రూ.15వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్ ఐ జయప్రకాష్ నారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు.