calender_icon.png 4 July, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరి పట్లా వివక్ష చూపలేదు

04-07-2025 12:17:32 AM

  1. పారదర్శకంగా మెయిన్స్ మూల్యాంకనం
  2. పిటిషనర్లవి కేవలం అపోహలు మాత్రమే
  3. గ్రూప్1పై వారి ఆరోపణలు అవాస్తవం
  4. హైకోర్టుకు తెలిపిన టీజీపీఎస్సీ
  5. విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): గ్రూప్1 మెయిన్స్ మూల్యాం కనం పారదర్శకంగా జరిగిందని, ఏ మీడియం అభ్యర్థుల పట్ల వివక్ష చూపలేదని హైకోర్టుకు తెలంగాణ పబ్లిక సర్వీ స్ కమిషన్ (టీజీపీఎస్సీ) తెలిపింది. గ్రూప్1 పరీక్షపై కొందరు అభ్యర్థులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని, వారివి కేవలం అపోహలు మాత్రమేనని హైకోర్టుకు టీజీపీఎస్సీ పేర్కొన్నది.

గ్రూప్1లో తెలుగు మీడి యం అభ్యర్థులకు సరైన మార్కులు మా ర్కులు వేయలేదని పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం గ్రూప్1 పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్1కు తెలుగు మీడియం అభ్యర్థులు 9.95 శాతం, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు 89.88 శాతం, ఉర్దూ మీడియం అభ్యర్థులు 0.1 శాతం ఎంపికయ్యారని తెలిపారు.

ఎంపికలో ఏ భాషా అభ్యర్థుల పట్ల ఎలాంటి వివక్ష చూపలేదని వివరించారు. ఎక్స్‌పర్ట్స్ ఎంపిక చేసిన అంశాల ఆధారంగానే అభ్యర్థులకు మార్కులు వేశారని హైకోర్టు నిరంజన్ రెడ్డి తెలిపారు. పిటిషనర్లు ఆరోపిస్తునట్లుగా పరీక్షరాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదని, నామిన ల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పరీక్షకు హాజరైన వారి వివరాలు వెల్లడించినట్లు ఆయన వివరించారు.

కోఠిలోని రెండు పరీక్ష కేంద్రాల్లో 1,500 మంది అభ్యర్థులు మెయిన్స్ రాశారన్నారు. కోఠిలోని రెండు కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని మహిళలకు కేటాయించామన్నారు. కోఠిలోని ఓ కేంద్రంలో పరీక్ష రాసినవారే ఎక్కువ మంది ఎంపికయ్యారనే అవాస్తమన్నారు. మిగతా పరీక్ష కేంద్రాల్లో రాసి న వాళ్లలో అంతకంటే ఎక్కు వ మందే ఎంపికయ్యారని హైకోర్టుకు నిరంజన్ రెడ్డి తెలిపారు.

మెయిన్స్‌కు ఎంపికకాని కొంతమంది అభ్యర్థులు ఏవేవో అనుమానాలతో పిటిషన్లు వేశారని, వారు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని, వారివి కేవలం అపోహ లు మాత్రమేనని కోర్టుకు టీజీపీఎస్సీ న్యా యవాది విన్నవించారు.

ఈ సందర్భం గా మూల్యాంకనం చేసే వారికి ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. టీజీపీఎస్సీ నుంచి వివరాలు తీ సుకుని సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పిస్తామని న్యాయవాది నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తదుపరి విచారణను హై కోర్టు శుక్రవారానికి వాయిదావేసింది.