25-12-2025 12:00:00 AM
డాక్టర్ సంగని మల్లేశ్వర్ :
పల్లె సీమలు ప్రగతికి పట్టుగొమ్మలు. గ్రామాలూ బాగుంటేనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గ్రామాల్లో అభివృ ద్ధి కోసం వివిధ అవసరాల కోసం నిధులు కేటాయిస్తాయి. రాష్ర్ట ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన తలసరి లెక్కించి నేరుగా విడుదల చేస్తుంది. ప్రజల మౌళిక అవసరాలు తీర్చేలా పనులు చేపట్టడం పంచాయతీ పరిపాలకుల భాద్యత. ఇందులో ప్రధానంగా తాగునీరు, పారిశుద్యం, రోడ్లు, విద్యుద్దీపాలకు ఖర్చు చేస్తుంది.
ఏడాది కాలంగా గ్రామాలకు ఎలాంటి నిధులు కేంద్రం ఇవ్వలేదు. ఇన్నాళ్లు కార్యదర్శులే పాలకులుగా వ్యవహరించడం వల్ల అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. విచి త్రం ఏమిటంటే కార్యదర్శులు చిన్న, చిన్న పనుల కోసం అప్పులు తెచ్చి కాలం వెళ్లదీసిన పరిస్థితి. అభివృద్ధికి డబ్బుల లేకపోవ డంతో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు మొఖం చాటేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి.
పల్లె భారమంతా కార్యదర్శులపై పడడంతో వారి పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్న చందంగా పరిస్థితి ఉండేది. కేంద్ర ప్రభు త్వం కాలపరిమితి ముగిసిన గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్లానింగ్ కమిషన్ కూడా నిధులు విడుదల చేయలేకపోయింది. గ్రామా పం చాయతీ ఖాతాలు ఖాళీగా, పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడాయి.
ఏడాదికి పైగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అం శం తేలక, తర్జన భర్జన పడుతున్న క్రమం లో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో రా ష్ర్ట ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఎన్నిక లు నిర్వహించి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను మురిగిపోకుండా రాబట్టడం లో రేవంత్ ప్రభుత్వం సఫలమయ్యిందని చెప్పొచ్చు.
గ్రామ స్వరాజ్యం దిశగా..
గ్రామాలు పురోగతి సాధించడానికి మూడు రకాల ఖాతాలు ఉంటాయి. వీటి లో ఒకటి ఆస్తి పన్ను జమచేసే ఖాతా, ఇక రెండవది రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులను జమ చేయడానికి, మూడవది కేంద్రం నేరుగా జమచేసే జీపీ ఖాతా ఉంటుంది. మొదటి ఖాతా విషయానికి వస్తే గ్రామాల్లో ఉహించినట్టుగా ఆస్తిప న్ను అంతంత మాత్రమే వసూలు అవుతున్నాయి. గ్రామాల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి.
రెండవ ఖాతాలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప కోట్లాది రూపా యలు జమచేసిన దాఖలాలు లేవు. మూ డవ ఖాతాలో మాత్రం ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒక్కసారి నిధులు జమ అవుతుంటాయి. ఆ నిధులు గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంటారు. సకాలం లో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేం ద్రం నుంచి చిన్న పైసా సాయం కూడా అందించలేకపోయింది. దీంతో గ్రామాల్లో అహర్నిశలు కష్టపడి పనిచేసే పారిశుధ్య కార్మికుల జీతాలకు ఇబ్బందులు తప్పలేదు.
ఇదే అదనుగా ఇన్‌చార్జీల పాలనలో నిధులు లేవని, మేము గ్రామాల్లోకి వెళ్ళితే నానా బూతులు తిడుతున్నారని, కుంటి సాకులు చెప్పి తప్పించుకునేవారు. వాళ్లు గ్రామాలకు రాకుండా సొంత శాఖలో విధులు నిర్వహించకపోవడంతో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయే పరిస్థితి వచ్చింది.
అయితే బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ఎజెండాలో ఉన్నప్పటికీ, జాప్యం చేయకుండా పార్టీ పరంగా రిజర్వేషన్లు ప్రకటిం చి, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం తమ దార్శనికతను చాటుకుంది. కేంద్రం ఇచ్చే నిధులతో గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దడానికి గొప్ప సువర్ణావకాశం దక్కించుకుంది. పల్లె లు దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ కలను కాంగ్రెస్ సర్కార్ నిజం చేస్తూ నేడు తెలంగాణ గ్రామ పంచాయతీలను దేశానికి మార్గదర్శకంగా, ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నిమగ్నమై ఉంది.
దిద్దుబాటు చర్యలు..
మనిషి బతకడానికి పట్టెడన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం కాదు. మనిషి ఎదగ డానికి అభివృద్ధి మార్గాలు తెరిచి పెట్టడమే పేదరిక నిర్ములన పథకాల లక్ష్యం కావాలని ఐక్యరాజ్యసమితి పదే పదే పేర్కొంటూ వస్తున్నది. అయితే ప్రభుత్వా లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. అభివృద్ధి అనేది మరుగున పడిపోకుండా రేవంత్ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టంలో 61.3 శాతం జనాభాను కలిగి ఉన్న గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు దిద్దుబాటు చర్యలు తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించింది. కులవృ త్తులు, చేతివృత్తులు, వ్యవసాయాధారిత వృత్తులు అభివృద్ధి చెందినప్పుడే ఆ దేశం భౌతికంగా, మేధోపరంగా అభివృద్ధి చెందగలుగుతుంది అన్న మహాత్మా గాంధీ మా టల్ని నిజం చేస్తూ, ఏయే కులవృత్తు లు ఎలాంటి ఆదరణ అందిస్తే వారు స్వ యం పోషకంగా ఎదిగి సంపద సృష్టి లో భాగస్వాములవుతారనేది స్పష్టంగా తెలియ జేసింది.
అందుకోసం ఒక లోతైన అధ్యయనంతో, వివేకంతో సాహసోపేతం గా మానవీయకోణంలో ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ తెలంగాణ గ్రామీణ జీవితానికి ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం కరువు కాటకాలు కాన రాని, కన్నీటి జాడలేని బంగారు భవిష్యత్ నిర్మాణంలో భాగంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం, కొత్త సర్పంచ్ పాలక వర్గం పగ్గాలు చేపట్టడంతో ఇప్పు డు పల్లె ల్లో మళ్లీ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
చేతినిండా పనితో, పాడి పంట లతో, పశు సంపదతో ప్రతి లోగిలి కళకళలాడే అవకాశముంది. గాంధీ జీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం రావాలని ఆకాంక్షిద్దాం. అంతేకాదు గతంలో మనం చూసి న పల్లె సౌందర్యం మళ్లీ కళ్ల ముందు నిలుస్తుందనడంలో సందేహం లేదు.
భద్రతకు ప్రాధాన్యం..
మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటికే కొత్త పంచాయతీలు కొలువుతీరాయి. 12,702 పంచాయతీలకు సర్పంచ్ లు గ్రామ ప్రథమ పౌరులుగా, ఉప సర్పంచ్‌లు, 1,11,803 మంది వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రతి గ్రామంలో పండగ వాతావర ణం కనిపించింది. ఇన్నాళ్లు మూలన పడ్డ పనులు ముందర వేసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల పట్ల అవగాహన పెంచుకోవాలి.
అప్పుడే అర్హులు ఎవరు? అనర్హులు ఎవరూ? అనేది స్ప ష్టంగా తెలుస్తుంది. దీనివల్ల అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పేరు ప్రతిష్టలు సంపదగా భావిస్తున్న సర్పంచ్ పదవి ముళ్లకిరీటమే. ప్రతి నెల పేదలకు అందించే రేషన్ సరుకులు అందరికి అందుతున్నాయా? ప్రతి పేదవాడికి ‘జీ రామ్ జి’ ఉపాధి హామీ అందుతుందా? పాఠశాలల పని తీరు ఏ విధంగా ఉంది? ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్, పోలియో చుక్కలు సక్రమంగా వేస్తున్నారా? వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు వచ్చే రైతు భరోసా అందిందా? రైతు భీమా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంత ఉందా? పచ్చదనం, పరిశుభ్రతతో పాటు మనిషి భద్రతా ప్రాధా న్యంగా సర్పంచ్‌లు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
ప్రతి పంచాయతీలో కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉందని గమనించిన కొందరు సర్పంచ్‌లు సూర్యాపేట నుంచి ప్రత్యేకంగా టీం రప్పించి కోతులను పట్టించారు. యువతను పెడదోవ పట్టిస్తున్న మద్యంపై కొందరు సర్పం చ్‌లు ఏకంగా యుద్ధం ప్రకటించారు. మా టలు కాకుండా చేతలు చూపించి ఆదర్శ గ్రామంగా రాష్ర్టపతి నుంచి అవార్డు తీసుకున్న గంగదేవిపల్లిని మరిపించే విధంగా కొత్త పంచాయతీ పాలక మండలి మురిపిస్తుందని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9866255355