25-12-2025 12:00:00 AM
ఐ.ప్రసాదరావు :
భారతదేశాన్ని తాజాగా చుట్టుముట్టుతున్న మరో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం ‘సేవ్ ఆరావళి’. ప్రపంచ వ్యాప్తంగా ‘ క్లుమైట్ ఛేంజ్” వాతావరణ మార్పులనేవి పెద్ద సమస్యగా మారిపోయాయి. ఇష్టారీతిన అడవుల నరికివేత, అక్రమ మైనింగ్, ప్రకృతి వనరులు దోపిడీతో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడూ ఎండలతో మండిపోయే అరబ్ దేశాల్లో ఇటీవల అకాల వర్షాలు, వరదలు, గడ్డకట్టే చలితో తల్లడిల్లితున్న పరిస్థితి ఏర్పడడం పర్యావరణవేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక మనదేశంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని హిమాలయ పర్వ త శ్రేణుల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారత అటవీ చట్టం -1927, అటవీ పరిరక్షణ చ ట్టం -1980, అటవీ హక్కుల చట్టం -2006 వంటి చట్టాలను తుంగలో తొక్కి విలువైన ఖనిజాలు, అటవీ సంపద కార్పొరేట్ వర్గాలకు దోచి పెట్టడానికి మార్గం సుగమం చేయడం అనర్థాలకు దారి తీస్తుంది.
ఉత్తరాఖండ్‌లో వరదల బీభత్సం, హిమాల య శిఖరాలు కరగడం లాంటివే ఇందుకు ఉదాహరణ. అయినప్పటికీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అటవీ హక్కుల చట్టాలను, పర్యావరణ పరిరక్షణ చట్టాలను అమలు చేయడంలోను శ్రద్ధ చూపడం లేదు. దీం తో ఇష్టారాజ్యంగా అటవీ సంపద ఆవిరైపోతూ ప్రకృతి వైఫరీత్యాలకు దారి తీస్తుంది.
కరుగుతున్న అటవీ సంపద..
దేశంలో దాదాపు 13 లక్షల హెక్టార్ల అటవీ భూములు ఆక్రమణకు, కబ్జాలకు గురైనట్లు సమాచారం. వీటిలో అస్సాం, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ర్ట, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. శాస్త్రీయంగా దేశం సుభిక్షంగా ఉండాలంటే దేశ భూభాగంలో 33 శాతం అటవీప్రాంతం ఉండాలి.. అయి తే నేటి గణాంకాలు ప్రకారం మన దేశం లో కేవలం 21.71శాతం మాత్రమే ఉండ డం గమనించాల్సిన అంశం.
ఒక పక్కన అటవీ సంపద ఆవిరైపోతుంటే.. తాజాగా కొండలు, గుట్టలు, పర్వతాలు కూడా ప్రభుత్వాలు అండదండలతో బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఖనిజాల వెలికితీత కోసం దేశాభివృద్ధి అనే పేరుతో ప్రకృతి విధ్వంసానికి తెరలేపారు. కేంద్రం చర్యలకు కోర్టు తీర్పులు కూడా అనుకూలంగా రావడంతో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జోరందుకున్నాయి.
దీనికి తాజా ఉదాహరణే ఆరావళి పర్వతాలను ఆనమాలు లేకుండా చేసే పని ప్రారంభించ డమే. 100 మీటర్ల కంటే ఎత్తయిన గుట్టలను మాత్ర మే ఆరావళి పర్వతాలుగా గుర్తిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం, దీనికి సుప్రీంకోర్టు కోర్టు కూడా అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ప్రతిపక్షాలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారు లు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో ‘సేవ్ ఆరావళి’ పేరిట పర్యావరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
అక్రమాలకు అడ్డుకట్ట..
సుమారు 670 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన, భూమిపైన అత్యంత పురాతన పర్వతశ్రేణులుగా పేరుపొందిన ఆరావళి పర్వతాలు భవిష్యత్తులో కనుమరుగై పోతాయి అనేది ఇప్పుడ ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ వరకూ ఉన్న ప్రాంత ప్రజలను రాజస్థాన్ నుంచి వచ్చే వేడి గాలులు నుంచి తప్పించడానికి ఆరావళి పర్వత శ్రేణులు అడ్డుగా ఉంటాయి.
తాజాగా ఈ రక్షణ కవచం ఆవిరైపోతుందన్న నేపథ్యంలో ఉద్యమం ఊపందుకుంది. దీనికి తోడు జీవవైవిధ్యం కూడా అంతరించే పరిస్థితి నెలకొంది.. ఇప్పటికే దేశ రాజధాని న్యూఢిల్లీ వాయు కాలుష్యంతో అతలాకుతలమవుతోంది. ఇప్పుడు ఆరావళి పర్వతాలను మైనింగ్ పేరుతో కరిగిం చడం వల్ల దేశంలోని అనేక రాష్ట్రాలు భవిష్యత్తులో ఎడారి ప్రాంతాలుగా మారే అవకాశముంది.
ప్రకృతికి విరుద్ధంగా కార్పొరేట్ వ్యక్తులు అభివృద్ధి పేరుతో దోపిడీ కొనసాగిస్తున్నారు. దాదాపు 670 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆరావళి పర్వతా లు భూఅవశేషాలతో అలరారుతూ పర్యావరణ పరిరక్షణకు, జీవవైవిధ్యాన్ని కాపాడు తున్నాయి. అభివృద్ధి పేరుతో ఖనిజాల ఏరివేతకు, అక్రమ మైనింగ్ కు అను మతులు ఇవ్వడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
మనుగడ ప్రశ్నార్థకం!
మానవ మనుగడకు కీలకంగా ఉన్న ఆరావళితో ఆటలాడవద్దు. రాజస్థాన్ నుంచి వచ్చే వేడి గాలులు, హిమాలయ పర్వతాల నుండి వచ్చే చలి గాలులు నుంచి ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న ఆరావళి పర్వతాలను అక్కున చేర్చుకోవాలి. ఇప్పటికే అమెజాన్ నది పరివాహక ప్రాంతాల్లో మైనింగ్ పేరుతో చేపట్టిన కార్యక్రమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణం మార్పులు ఏ విధంగా ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. టూరిజం అభివృద్ధి పేరుతో ఉత్తరాఖండ్ , హర్యానాల్లో అడవులు నరికివేతను ప్రోత్సహిస్తూ విలువైన సంపదను కోల్పోతున్నాం.
ఇలాంటి పరిస్థితుల్లో దేశ జనాభాలో సగభాగం నివసిస్తున్న ఆరావళీ పర్వత ప్రాంతాల ప్రజల జీవితాలను, మనుగడ ప్రశ్నార్థమయ్యే అవకాశముంది. అందుకే పర్యావరణ పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అభివృద్ధి పేరుతో విలువైన అటవీ సంపదను, అరుదైన ఖనిజాలను దేశంలోని బడా పారిశ్రామిక వేత్తలకు దోచి పెడుతుండడం సరైనది కాదని ప్రజానీకం గ్రహించాలి.
యువత ముందుకు రావాలి..
ఆరావళి పర్వత శ్రేణులను కాపాడేందుకు నేటి జనరేషన్ జెడ్ యువత ముందుకు రావాలి. నేటి పాలకుల కూడా జెన్ జెడ్ యువతను ప్రోత్సహించాలి. నిరుద్యోగ నిర్మూలనకు, పేదరికం తగ్గించడానికి, అధిక ధరలు నియంత్రణకు ఈ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై ఐక్యంగా అందరూ గళం ఎత్తాలి. వివక్షత, విద్వే ష, విభజన రాజకీయాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి. యువతకు మంచి నాణ్యమైన విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి పర్యావరణం కల్పించేం దుకు ప్రభుత్వాలు కృషి చేయడమే అభివృద్ధికి అర్థం.
‘పేర్లు మార్చడం ద్వారా ప్రగతి రాదు’ అని తెలపాలి. ప్రభుత్వాలు పారదర్శకంగా పరిపాలన అందించే విధంగా, ప్రజల జీవితాలను మెరుగు పరిచే విధం గా, పర్యావరణ పరిరక్షణకు పాటు పడే విధంగా ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేయా లి. ‘ఆరావళి అందరిదీ.. ఆరావళి పర్వతాల పరిరక్షణలోనే ప్రజల అభివృద్ధి దాగి ఉంది’ అని చాటిచెప్పాలి.‘ సేవ్ ఆరావళి’ పేరుతో చేస్తున్న పరిరక్షణ ఉద్యమంలో అందరూ భాగస్వాములవ్వాలి.
వ్యాసకర్త సెల్: 6305682733