12-12-2025 12:55:15 AM
ఓటేసి సేవ చేసే భాగ్యం కల్పించండి
అబద్ధాలు చెప్పా.. అభివృద్ధి చేస్తా
కన్నాయిగూడెం,డిసెంబర్11(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవుల గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మీ అమూల్యమైన ఓటు నాకు గెలిపించాలని బీజేపీ పార్టీ గూర్రేవుల గ్రామ సర్పంచ్ అభ్యర్థి వాసంపల్లి నందిని అన్నారు గూర్రేవుల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది అభివృద్ధిలోను అగ్రగామిగా ముందు ఉంచుతానని అన్నారు. గురువారం గ్రామంలోని ఇంటింట ప్రచా రాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటర్లతో వాసంపల్లి నందిని మాట్లాడుతూ గ్రామంలోని అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయిన పనులు పరిష్కారం కావాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని వాటిని అధికారులతో ప్రశ్నించి పరిష్కరించే దిశగా గ్రామంలోని పలు రకాల యువజన సంఘాల నాయకులు మహిళా సంఘాలు గ్రామస్తుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతానని గ్రామ అభివృద్ధి కోసం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం ప్రజలకు తెలియజేసిన తర్వాతనే శ్రీకారం చుడతానని తెలిపారు.
ప్రభుత్వ ప్రయోజన పథకాలు అర్హులైన ప్రతి కుటుంబాలకు అందేలా చూస్తానని యువతకు ఉపాధి అవకాశాలు మహిళా సంఘాల సభ్యుల శ్రేయస్సు కోసం పలు రకాల ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలను ఏర్పాటు చేస్తానని తాను అబద్ధాలు చెప్పానని చెప్పిన అభివృద్ధి చేసి చూపించని తర్వాత ప్రజలు చేసిన ఏ శిక్షకైనా తాను సిద్ధంగా ఉంటానని, ప్రజాసేవయే లక్ష్యంగా ఊరికి సేవ చేసుకొని గూర్రేవుల పేరు ఆదర్శ గ్రామంగా నిలపాలని ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నానని తెలిపారు. గెలిచిన త్వరలోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని తెలిపారు.
గ్రామంలో వైద్యం విద్య ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తానని అన్నారు. గ్రామ ప్రజలు ఒకసారి ఆలోచించి ఈ ఎన్నికల్లో ఓటు వేసి సర్పంచుగా గెలిపించాలని వాసంపల్లి నందిని విజ్ఞప్తిచేశారు.