12-12-2025 12:53:48 AM
భీమదేవరపల్లి,డిసెంబరు11 (విజయ క్రాంతి)హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాజీ ప్రధాని పివి స్వగ్రామంవంగరలో ఓటు హక్కు వినియోగించుకున్న పి. వి.కుటుంబీకులు.గురువారం నాడు మొదటి దశ సర్పంచ్ పదవికి గాను జరిగిన పోలింగ్ లో ‘భారతరత్న‘ మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కుటుంబీకులు వంగరలో ఓటు హ క్కు వినియోగించుకున్నారుపి.వి.సోదరుడు పి.వి.మనోహర్ రావు కుమారుడు భీమదేవరపల్లి మండల మాజీ ఉపాధ్యక్షుడు పి.వి.మదన్ మోహన్ సతీమణి సంధ్యమదన్ వంగర గ్రామ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి వంగర గ్రామంలో ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును కొనసాగిస్తున్నట్లు వివరించారు...వంగరలో తాము ఓటు హక్కు కలిగివుండడం పట్ల గర్వంగా వుందని తెలిపారు.గతంలో పి.వి.వంశస్తులకు చెందిన వారందరూ వంగరలో ఓటు హక్కు కలిగి వుండేవారని అనంతరం వివిధ ప్రాంతాలలో స్థిరపడిన సందర్భంగా ఆయా ప్రాంతాలకు ఓటు హక్కు బదిలీ చేసుకున్నారని ఆయన వివరించారు.