calender_icon.png 27 October, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో ఉద్యోగం, సంపాదన వదులుకున్నా..

27-10-2025 01:31:12 AM

  1. ప్రజలకు సేవ చేయాలని  రాజకీయాల్లోకి వచ్చా

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ 

వనస్థలిపురం డివిజన్‌లో  అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

ఎల్బీనగర్, అక్టోబర్ 26 : ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని, అమెరికాలో ఉద్యోగం, సంపాదన వదులుకున్నానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అన్నారు. వనస్థలిపురం డివిజన్ శ్రీనివాసపురం కాలనీలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు  నిర్మాణ పనులకు ఆదివారం మధుయాష్కీగౌడ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి,

కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీలో వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో  ఏర్పాటు చేసిన సమావేశంలో మధుయాష్కి మాట్లాడారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నివాస యోగ్యమైన ప్రాంతమని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 

ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినవాడిగా ఎల్బీనగర్ నియోజక వర్గంలో సమస్యలను తన బాధ్యతగా పరిష్కరిస్తున్నానని పేర్కొన్నారు.  ఎల్బీ నగర్‌లో అన్ని సమస్యలు పరిష్కరించానని, ఇక ఏ సమస్యలు లేవని.. ఎన్నికలప్పుడు స్థానిక ఎమ్మెల్యే చెప్పుకున్నాడని.. కానీ రోడ్లు,  డ్రైనేజీ, వరద ముంపు, మంచినీరు,  చెత్త సేకరణ తదితర సమస్యలు ప్రజలు చెబుతుండడం చూస్తే, ఇక ఎక్కడ అభివృద్ధి చేసినట్లు? అని ప్రశ్నించారు.

కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా నిధులు వస్తున్నాయని, జిహెచ్‌ఎంసి లోనే వనస్థలిపురం డివిజన్ కు అత్యధికంగా నిధులు తీసుకువచ్చే అభివృద్ధి పనులు చేయిస్తున్నట్లు వివరించారు. మల్ రెడ్డి రాం రెడ్డి మాట్లాడుతూ.. హ్యామ్ రోడ్లు ప్రాజెక్టు ద్వారా ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో రూ. 270 కోట్లతో రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు ఫ్లై ఓవర్ తో కూడిన మెట్రో  రైల్ రాబోతుందని, రూ. 650 ఓట్లతో డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. డివిజన్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మధుయాష్కీగౌడ్ సహకారంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, బుడ్డ సత్యనారాయణ, పన్యాల జైపాల్ రెడ్డి, మేఘవత్  గణేష్ నాయక్, దేవాలయ కమిటీ డైరెక్టర్ కంచర్ల కవిత, నాయకులు సామ మహేశ్వర్ రెడ్డి, భాను, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.