08-01-2026 12:25:34 AM
అటవీ శాఖ అనుమతులు రాక అవస్థ
సింగల్ ఫేజ్ కరెంటుతో వ్యవసాయ బోర్లు వేసుకోలేని దుస్థితి
దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు గడిచిన నిర్మల్ జిల్లాలోని గిరిజన గూడాల పరిస్థితి మారలేదు. గిరిజన గూడెంలో నివసిస్తున్న ఆదివాసి గిరిజనులకు కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారు. దట్టమైన అడవులు కొండకోనలు చుట్టూ గలగల పారే వాగులు పరిష్కారాలు చుట్టు అడవి మృగాల సంచారంతో దిన దిన గండంగా బతుకుతున్న గిరిజ న ఆదివాసి కుటుంబాలకు నేటికీ త్రీ ఫేజ్ కరెంటు సౌకర్యం లేదు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన మా గిరిజన గుడాల పరిస్థితి మారడం లేదని ఆవేదన చెందుతున్నారు.
నిర్మల్, జనవరి ౭ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లాలోని మారుమూల గిరిజన మండలమైన కడెం పెంబి మండలంలోని 16 గిరిజన గూడెలకు ఇప్పటికీ సింగిల్ ఫేజ్ కరెంటుతోని సరిపెట్టుకుంటున్నారు. పెంబి మండలంలోని కోరుగంటి కోరుగొ ట్టి తండా, సూర్యంగూడం, పోచంపల్లి, ఎగ్లాపుర్, రాగిదుబ్బ, జాడిమల్లి, గుమ్మెలతో పాటు కడెం మండలంలోని వివిధ ఆదివాసి గిరిజన గోడలకు త్రీఫేజ్ కరెంటు ఇవ్వాలని రెండు దశాబ్దాలుగా ఆదివాసి గిరిజన బిడ్డలు కోరుతున్నారు.
ఈ 16 గూడల్లో సుమారు 1500 కుటుంబాలు జీవిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్న వీరికి సింగల్ ఫేజ్ కరెంటు కారణంగా వ్యవసాయ బోర్లు మోట ర్లు వేసుకోలేని దుస్థితి నెలకొంది దీంతో వర్ష ఆధారంగా ఒకే పంటను పండించడం వల్ల ప్రకృతి కరుణిస్తే దిగుబడి వస్తుం దని లేకుంటే పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు ఉన్న అనుమతులు లేవు
నిర్మల్ జిల్లాలోని మార్బుల ఆదివాసి గిరిజనగూడాలకు 15 ఏళ్ల క్రితం వరకు విద్యుత్ సౌకర్యం లేదు అప్పట్లో అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు సింగిల్ ఫేజ్ కరెంటు సదుపాయం కల్పించారు దాన్ని త్రీఫేజ్‌గా మార్చాలని పెంబికడంలోని 16 గిరిజన ఆదివాసి గూడాల గిరిజన బిడ్డలు పాలకులకు అధికారులకు విన్నవించుకుంటున్నారు.
అయి తే ఈగిరిజన గుడాలకు త్రీఫేజ్ కరెంటు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ మూడేళ్ల క్రితం నిధులు మంజూరు చేసి పనులను సంబంధ కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు అయితే గ్రామాలకు వచ్చి ప్రధాన విద్యుత్ లైన్లు అడవి మార్గంలో ఉండడం వల్ల అడవుల్లో విద్యుత్ స్తంభాలు వేసుకునేందుకు అటవీ శాఖ అధికారులు అనుమతుల కోసం ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్న ఏళ్ల తరబడి అనుమతులు రావడంలేదని అంటున్నారు.
మైదాన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వ్యక్తి లైన్లు వైర్లు ట్రాన్స్ఫార్మర్లు తెచ్చినప్పటికీ అటవీశాఖ అనుమతుల జాతకం కారణంగా విద్యుత్ శాఖ కాంట్రాక్టర్లు పల్లెలు అర్ధాంతరం గా నిలిపివేసి ఉన్న సామాగ్రితో తిరిగి వెళ్లిపోయారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి మూడు ఫేజ్‌ల కరెంటు ఇవ్వాలని ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఎంపీ రాష్ట్ర మంత్రులు జిల్లా కలెక్టర్ అధికారులకు ఎంపీటీసీఎల్ ఎండి లకు మూడు సంవత్సరాలుగా వినతి పత్రాలు ఇస్తున్న తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం మూడు ఫేసుల కరెంటు సరఫరా చేస్తే ఆ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు బోర్లు వేసుకొని మూడు పంటలు పండించే అవకాశం ఉందని కుటీర పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందెందుకు అవకాశం ఉంటుందని వారు వేడుకుంటున్నా రు. ప్రతి ఎన్నికల్లో ఎన్నికల హామీగా వివిధ రాజకీయ పార్టీల నేతలు మారుమూల ఆదివా సి గిరిజన గోడలకు త్రీఫేస్ కరెంటు రవాణా సదుపాయం విద్యా వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తున్న ప్రభుత్వ సమన్వయ లోపం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ గిరిజనగూడాలకు త్రీఫేజ్ కరెంటు అందని ద్రాక్ష గాని మిగులుతుంది
సమస్యల పరిష్కార కోసం పోరుబాట
మారుమూల గిరిజన ఆదివాసి గూడెంలో మౌలిక సదుపాయాల కల్పనకై ఆదివాసి గూ డేల గిరిజనులు ఇప్పటికి అనేకసార్లు పోరాటం చేశారు. మూడేళ్ల క్రితం తమ గ్రామంలో నీటి సరఫరా చేయాలని కలెక్టర్ కార్యాలయం ఆదివాసి గిరిజనులు నడిచి వచ్చి ఇక్కడే వారం రోజుల పాటు నిరసన తెలిపారు రోడ్లు గిరిజనగూడాల్లో విద్య వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలని ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు రిజర్వు ఫారెస్ట్ పేరు టైగర్ జోరు పేరుతో ఆం క్షలు విధించి కనీసం పోయికట్టలు కొట్టడం లేదని ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కూడా ఇసుక కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన చెప్తున్నా రు. అటవీ ఉత్పత్తులపై ఆదివాసి గిరిజన బిడ్డలకు హక్కులు ఉన్న అటవీ శాఖ అధికారులు మాత్రం వారు మొరపెట్టుకుంటున్నారు.
హామీ ఇస్తున్నారు.. అమలు చేయడం లేదు
పెంబి మండలంలోని మారుమూల ఆదివాసి గిరిజన గూడెం మాది కోరుకంటి తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మొన్ననే ఎన్నికైన మా గ్రామంతో పాటు అనుబంధ తండాలైన సూర్య గూడెం కోరుగంటి గ్రామాల్లో 120 కుటుంబాలు జీవిస్తున్న ఇప్పటికి త్రీఫేజ్ కరెంటు లేదు ప్రతి ఎన్నికల్లో పార్టీల నేతలు హామీ ఇస్తున్నారు దాన్ని అమలు చేయడం లేదు త్రీఫేజ్ కరెంటును వెంటనే తరపరచసే విధంగా చర్యలు తీసుకోవాలి.
కోట్నాక పార్వతి, సర్పంచ్ కోరు కంటి తండా
గిరిజన గూడలకు త్రీఫేజ్ కరెంట్ ఇస్తాం
నిర్మల్ జిల్లాలోని ఆదివాసి గిరిజన గోడలకు త్రీఫేజ్ కరెంటు ఇవ్వడమే కాకుండా అక్కడ మౌలిక సదుపాయాల కల్పనపై జిల్లా యంత్రాంగం అనేక చర్యలను చేపట్టింది. విద్యుత్తు లైన్ల విషయంలో విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు కేంద్ర అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉన్నందున కొంత జాప్యం జరుగుతుంది వారం రోజుల్లో సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం.
అభిలాష అభినవ్, కలెక్టర్