20-12-2025 02:17:06 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 19 (విజయక్రాంతి): ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 22న హైదరాబాద్‌లో భారీ సదస్సు జరగనుంది. అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సె క్యూరిటీ ఏజెన్సీస్ అప్సా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మాన వ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ వెల్ఫేర్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ భాస్కర్ రెడ్డి తెలిపారు.
ఈ సమ్మిట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు గురువా రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అప్సా చీఫ్ అడ్వైజర్, మాజీ డీజీ పీ స్వరణ్ జీత్ సేన్, అధ్యక్షుడు కెప్టెన్ బుద్ధ ఏ.ఆర్, చైర్మన్ భాస్కర్ రెడ్డిలు మా ట్లాడారు. 44 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థ ప్రాముఖ్యత ను వారు వివరించారు. గార్డులకు కనీస వేతనాలను పెంచడం, వేతన సవరణ చట్టం అమలు వంటి కీలక అంశాలపై సమ్మిట్‌లో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు.
సెక్యూరిటీ గార్డులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో తీర్మానాలు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. చర్చించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు సతీష్ రెడ్డి, రవీందర్, వెంకట నరసింహారావు, రాధిక ఎం.నాథ్ తదితరులు పాల్గొన్నారు.