05-10-2025 12:54:12 AM
హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాం తి): ‘దేశంలోని ప్రతి నిర్మాత సిగ్గుపడాల్సిన సందర్భం ఇది’ అని తనదైన శైలిలో స్పందించారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారా యి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజాచిత్రం ‘కాంతార చాప్టర్ 1’. ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు విడుదల తర్వా త కూడా అదే స్థాయిలో స్పందన వస్తోంది.
బాక్సాఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ రాబడుతోంది. ఇక తొలిరోజు ఏకంగా రూ.89 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.150 కోట్లకుపైగా గ్రాస్ సాధించటం విశేషం. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచే కాకుండా స్టార్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రభాస్, సందీప్‌రెడ్డి వంగా సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన విష యం తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలో సంచలన దర్శకుడు రామ్‌గో పాల్ వర్మ చేరిపోయారు. ఇటీవల సినిమా చూసిన ఆర్జీవీ సోషల్‌మీడి యా వేదికగా స్పందించారు. “కాంతార సినిమా ఒక అద్భుతం. దేశంలో ని ప్రతి నిర్మాత రిషబ్‌శెట్టి, అతడి టీమ్‌ను చూసి సిగ్గుపడాలి. సినిమాలోని కంటెంట్, వారి కష్టమే ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ అయ్యేలా చేసిం ది. సినిమా విషయంలో ఎక్కడా రాజీపడకుండా సహకారం అందించిన హోంబలే ఫిల్మ్స్‌ను అభినందిం చి తీరాలి.
రిషబ్‌శెట్టి గొప్ప యాక్టరా.. గొప్ప డైరెక్టరా..? అనేది తేల్చుకోలేకపోతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు రామ్‌గోపాల్‌వర్మ. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. బ్లాక్‌బస్టర్ ‘కాంతార’కు సీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న పాన్ ఇండి యా వైడ్ విడుదలైంది. ప్రస్తుతం థియేటర్లలో విశేషంగా ప్రేక్షకారదణ పొందుతూ సందడి చేస్తోంది.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. జయరాం, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.