calender_icon.png 30 January, 2026 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకోవాలి

30-01-2026 12:00:00 AM

జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్

కామారెడ్డి, జనవరి 29 (విజయక్రాంతి): రోడ్డు భద్రతపై ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. గురువారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026ను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియల్  మహాత్మ గాంధీ జ్యోతిబా ఫూలే పాఠశాల లో రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ తో పాటు సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు ఇర్షాద్, కృష్ణ తేజ, రఫీలు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని తెలిపారు.

పాదచారులుగా, బస్సులు, ఇతర వాహనాలలో ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సరళమైన భాషలో విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. చిన్న వయసులోనే రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.