26-08-2025 02:03:04 AM
అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
అచ్చంపేట ఆగస్టు 25:మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికి తాగునీరు తప్పనిసరిగా చేరాలని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు ఇచ్చే వినతులను వారి సమస్యలను పార దర్శకంగా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని విధుల్లో అలసత్వం వహిస్తే శాఖ పరంగా చర్యలు తప్పవనిహెచ్చరించారు.