calender_icon.png 26 August, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ డీలర్లకు వెంటనే కమీషన్లు విడుదల చేయాలి

26-08-2025 02:05:17 AM

అలంపూర్/ అయిజ , ఆగస్టు,25గత ఐదు నెలలుగా రేషన్ డీలర్లకు కమీషన్లు పడకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి ఆవేద న వ్యక్తం చేశారు.సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ జోషి శ్రీనివా స్ శర్మకు రేషన్ డీలర్లతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

ఐదు నెలలకు సంబంధించిన కమిషన్ వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అయ్యన్న, మద్దిలేటి గజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.అయిజ పట్టణ కేంద్రంలో తాహసిల్దార్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు నిరసన వ్యక్తం చేశారు.

మేరకు తహసిల్దార్ జ్యోతికి వారు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం వెంటనే రేషన్ డీలర్ల కమిషన్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రేషన్ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాములు ,పెద్ద శీను తదితరులు పాల్గొన్నారు.