03-07-2024 03:51:42 AM
మహబూబ్‌నగర్/కామారెడ్డి/అదిలాబాద్(నిర్మల్), జూలై 2 (విజయక్రాంతి): ప్రతి బీజేపి కార్యకర్త, తన తల్లితో కలిసి మొక్క నాటాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తన తల్లిచిత్రపటాన్ని పక్కన పెట్టుకుని మొక్కను నాటారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఏక్ పేడ్ మా కా నామ్’ పిలుపు మేరకు మొక్క నాటినట్లు ఆయన వెల్లడించారు.
బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశర్‌రెడ్డి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా దిలవార్‌పూర్ మండలం లోలం గ్రామంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి మొక్కలను నాటారు. మహబూబ్‌నగర్ మండలం లోని మన్యంకొండ ఆలయ ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణాసుధారాణి, కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. వారివెంట అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఉన్నారు.