19-11-2025 12:23:06 AM
ములకలపల్లి / దమ్మపేట, నవంబర్ 18 (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామమైన గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాపాలనకు హాజరైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ప్రజలు అందజేసిన దరఖాస్తులను సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. గండుగులపల్లి లోని క్యాంపు కార్యాలయానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తాను నియోజకవర్గ ప్రజలకు ఇంటిదగ్గర, క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని సమస్యల పరిష్కారం కోసం తనను ప్రజలు నేరుగా కలుసుకోవచ్చునని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హాజరైన ప్రజలకు తెలిపారు.