calender_icon.png 19 November, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రణాళికాబద్ధ సన్నద్ధతతో మెరుగైన ఫలితాలు

19-11-2025 12:21:17 AM

రెబ్బవరం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించి పదవతరగతి విద్యార్థులకు పరీక్షల సంసిద్ధత పై అవగాహన కల్పించిన కలెక్టర్

ఖమ్మం టౌన్, నవంబర్ 18 (విజయ క్రాంతి):పరీక్షలకు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమైతే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. వైరా మండలం రెబ్బవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదవ తరగతి గదిలో విద్యార్థులతో బోర్డు పరీక్షలకు ఎలా సంసిద్దం అవుతున్నారు అని అడిగి, ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు సులభంగా రాసేందుకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.

ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయవలసిన కార్యచరణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే వీరులు సైతం చిన్న, చిన్న లక్ష్యాలను పెట్టుకుంటూ, వాటిని సాధించడం ద్వారా తుది లక్ష్యం చేరుకుంటారని, అదే విధంగా 10వ తరగతి విద్యార్థులు ఉన్న సమయం ప్రణాళిక ప్రకారం వినియోగించుకుంటే పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారని అన్నారు.

పరీక్షల పట్ల ఎటువంటి ఒత్తిడి అవసరం లేదని, ప్రతి రోజు కొంత సమయం వాకింగ్, జాగింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీ చేయాలని అన్నారు. నిద్రాహారాలు మానేసి చదువు కోవాల్సిన అవసరం లేదని, ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటల పాటు బాగా నిద్ర పోవాలని, విద్యార్థులు మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, బయట జంక్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని కలెక్టర్ సూచించారు. 

 10వ తరగతి మెయిన్ పరీక్షల కంటే ముందు వీలైనంత మేర అధిక సంఖ్యలో ప్రీ ఫైనల్ పరీక్షలు రాయాలని కలెక్టర్ తెలిపారు. పరీక్షలు అధికంగా రాయడం వల్ల తుది పరీక్షలను ఎటువంటి ఒత్తిడి లేకుండా సులభంగా రాయగలుగుతామని అన్నారు.  మనం చదివిన దానికంటే రాసిన అంశాలు అధికంగా గుర్తుండిపోతాయని కలెక్టర్ తెలిపారు.  జడ్పీసీవో దీక్షా రైనా, వైరా తహసీల్దారు శ్రీనివాసరావు, హెడ్ మాస్టర్, టీచర్లు, సంబంధిత అధికారులు, తదితరులు  .