15-10-2025 01:20:55 AM
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ‘కే -ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానునన ఈ సినిమా వివేషాలను ప్రొడ్యూసర్లు మీడియాతో పంచుకున్నారు. నిర్మాత రాజేశ్ మాట్లాడుతూ.. “మా సంస్థలో అతి తక్కువ టైమ్‌లో విడుదలవుతున్న చిత్రమిదే. దర్శకుడు, హీరో ముందే ప్రిపేర్ అయి ఉండటం, అనవసర సన్నివేశాలను స్క్రిప్ట్ దశలోనే ఎడిట్ చేసుకోవడంతో మేకింగ్ టైమ్ చాలా తగ్గింది.
హీరో క్యారెక్టరైజేషన్ కోసం డైరెక్టర్ కొన్ని డైలాగ్స్ సహజంగా రాసుకున్నారు. ప్రేక్షకులు ఈ క్యారెక్టర్స్‌ను ఫాలో అవుతారే మోననే సందేహంతో సెన్సార్ వాళ్లు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. అందరూ ఈక్వల్ ఇమేజ్ ఉన్న హీరోలు కాబట్టే దీపావళికి ఇంత పోటీ ఉంది. అదే పవన్‌కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే మేము వెనక్కి తగ్గుతాం కదా. ప్రొడ్యూసర్స్ అంతా స్నేహితులమే. మా మధ్య విభేదాలు లేవు” అని చెప్పారు. ‘ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ప్రొడక్షన్ టైమ్‌లోనే కలిగింది’ అని మరో నిర్మాత శివ బొమ్మకు తెలిపారు.