calender_icon.png 16 October, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైండ్‌తో కాదు.. మనసుతో చూడండి

15-10-2025 01:22:09 AM

బీవీ వర్క్స్ బ్యానర్ ద్వారా బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ పతాకంపై కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డాకర్టర్ విజేందర్‌రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్రమండలి’. ఈ సినిమాలో ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం హీరోహీరోయిన్లు. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వీటీవీ గణేశ్ ముఖ్య పాత్రల్లో నటించారు.

అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మిత్ర మండలి’ పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీని మైండ్‌తో కాకుండా, మనసుతో చూడండి. అందరినీ నవ్విస్తుంది” అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. “మిత్ర మిండలి’ మీకు నచ్చకపోతే.. తర్వాత వచ్చే నా ఏ సినిమానూ చూడకండి” అని చెప్పారు.

బన్నీ వాస్ మాట్లాడుతూ.. “మన మూవీ బాగుండాలని పక్కన చిత్రాల్ని తక్కువ చేయడం, ట్రోలింగ్ చేయించడం, నెగెటివ్ ప్రచారం చేయించడం తప్పు. పోటీ అనేది ఎప్పుడూ ధర్మంగా ఉండాలి” అన్నారు. ‘అక్టోబర్ 16న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి హిట్ చేయండి’ అని నిహారిక ఎన్‌ఎం, డైరెక్టర్ విజయేందర్, నిర్మాతలు భాను ప్రతాప   విజేందర్ రెడ్డి తీగల చెప్పారు.