calender_icon.png 9 May, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకోవాలి

09-05-2025 02:17:40 AM

జిల్లా ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట, మే 8 (విజయక్రాంతి) : దేశ భద్రతకు ప్రతి ఒక్కరు బాధ్యతగా నడుచుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సరిహద్దుల వెంట ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌరుల రక్షణ, శాంతిభద్రతల ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం జిల్లాలో ముమ్మర తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా సెక్యూరిటీ సిబ్బంది డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది బస్టాండ్ లు, జాతీయ రహదారి, ఫ్లై ఓవర్లు, వ్యాపార సముదాయాలు, ముఖ్యమైన కూడళ్ల వద్ద హై సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల దృష్ట్యా జిల్లాలోని పోలీసులకు సెలవులు రద్దు చేసి 24 గంటలు విధుల్లో ఉండేలా ఆదేశాలు చేశామన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌరులు దేశ భద్రతకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు కూడా సోషల్ మీడియా నందు అనుచిత పోస్టింగులు, వ్యాఖ్యలు పెట్టొద్దన్నారు.

సున్నితమైన పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని చట్టానికి లోబడి నడుచుకోవాలన్నారు. గుర్తింపు నిర్ధారణ లేని వ్యక్తులకు, అనుమానితులు లాడ్జ్ ల నందు వసతి ఇవ్వవద్దనీ సూచించారు.  ఈ తనిఖీలలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు