calender_icon.png 9 May, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్‌క్రాస్ సేవలు వెలకట్టలేనివి

09-05-2025 02:17:22 AM

ప్రపంచ రెడ్‌క్రాస్ డే, తలసేమియా డే కార్యక్రమాల్లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ 

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్‌భవన్‌లో గురువారం ప్రపం చ రెడ్‌క్రాస్ డే, ప్రపంచ తలసేమియా డేల ను నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. సమాజం మానవత్వంతో కూడిన వ్యవహారశైలిని అలవర్చుకోవాలన్నారు.

ఈ సంవత్స రం రెడ్‌క్రాస్ దినోత్సవం ‘మానవత్వం వైపు..’ అనే థీమ్‌తో కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. 1920లో ప్రా రంభమైన భారత్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ తిరుగులేని విధంగా మానవ తా సేవలు చేస్తోందని చెప్పారు. తెలంగాణ లో 45వేల మందికి పైగా సభ్యత్వం ఉందన్నా రు.

రక్తదాన డ్రైవ్‌లు, వైద్యారోగ్యసేవలు, అనాథశ్రమాలు, ఓల్డేజ్ హోమ్‌లకు సేవలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సకాలంలో సాయం చేయడం వంటి వాటిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు వివరించారు. అలాగే ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..మనుగడ కోసం రక్తమా ర్పిడి, జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతు న్న వారికి స్టెమ్‌సెల్ డొనేషన్‌పై అవగాహన కల్పించాలన్నారు.

దీనికోసం పనిచేస్తున్న ధాత్రి సంస్థ కృషిని ఆయన అభినందించారు. ఈకార్యక్రమానికి హాజరైన తలసేమి యా వ్యాధిగ్రస్తులకు గవర్నర్ పండ్లు పంపిణీ చేశారు. బ్లడ్‌స్టెమ్‌సెల్ డోనర్ రిజిష్ర్టేషన్ డ్రైవ్‌ను గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. రాజ్‌భవన్ సిబ్బంది స్టెమ్‌సెల్ దాతలుగా రిజిష్ట్రర్ చేయించుకున్నారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, భారత్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.