22-12-2025 12:57:57 AM
మోతె, డిసెంబర్ 21(విజయక్రాంతి): గ్రామ అభివృద్ధి చేయడం తన భాద్యత అని అందుకు గ్రామస్తులు అందరూ సహకరించాలని గోపతండ సర్పంచ్ భూక్య బిక్కు నాయక్ అన్నారు. ఆదివారం గోపతండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.
గ్రామంలో కోతుల బెడద నుంచి కాపాడలని వీధి దీపాలు ఏర్పాటు చేయడం మురుగు కాల్వలు నిర్మాణం చేయడం అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయించడం వ్యవసాయ భూములకు వెళ్లే రోడ్ల నిర్మాణం చేయడం గోపతండ నుంచి దుబ్బ నరసింహల గూడెం వరకు రహదారి నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు.