calender_icon.png 22 December, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయిజలో పత్తి మిల్లును పరిశీలించిన కవిత

22-12-2025 12:57:34 AM

ఆయిజ, డిసెంబర్ 21: జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో పత్తి మిల్లును సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత.జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత జోగులాంభ గద్వాల జిల్లాలోని తుమ్మిళ ఎత్తిపోతల పధకం మరియు అయిజ, పెద్దధన్వాడను స్సందర్శించారు.అందులో భాగంగా అయిజలోని పత్తి మిల్లును సందర్శించి రైతులను ఉద్ద్యేశించి మాట్లాడుతూ పత్తిరైతు గిట్టుబాటు ధరలు లేక గోసపడుతున్నారని ప్రభుత్వం రైతుల సమస్యను గాలికొదిలేసిందని అన్నారు.

పత్తి మిల్లు యజానులతో తప్పుడు తుకాలతో రైతులను మోసం చేస్తే ఊరుకోమని అన్నారు. పెద్దధన్వాడలో ఇథనాల్ కంపెనీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాలుకల వైఖరి కనపరుస్తుందని,జనం బాట కార్యక్రమంలో దారిపొడుగునా జనం నీటి సమస్యలపైనే మాట్లాడుతున్నారని అన్నారు.ఈ ప్రభుత్వానికి ఆరు నెలలు సమయమిస్తున్నాము తీరు మార్చుకోకపోతే ప్రభుత్వాన్ని ఎండగడుతూ పాదయాత్ర చేయాల్సి వస్తుందని అన్నారు.ఈకార్యక్రమంలో గొంగళ్ల రంజిత్ కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.