22-12-2025 12:59:04 AM
నేర్మట నూతన సర్పంచ్ వసంత ధనయ్య
చండూరు, డిసెంబర్ 21(విజయక్రాంతి): గ్రామ అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తానని నేర్మట నూతన సర్పంచ్ నారపాక వసంత ధనయ్య అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, కుల, మతాలకతీతంగా అందర్నీ కలుపుక పోతామనన్నారు. తాము బిఆర్‌ఎస్ సహకారంతో ఈసారి ఎన్నికలలో విజయం సాధించామని, మా విజయం ఎప్పుడు ప్రజా సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తానన్నారు.
గ్రామ ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాటి పరిష్కారం కొరకు ముందుంటామన్నారు. గెలుపకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నేడు జరిగే నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గ్రామస్తులందరూ రావాలని కోరారు.