26-01-2026 01:33:12 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 25(విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీస్ హెడ్క్వార్టర్స్లో జరుగుతున్న పరేడ్ ప్రాక్టీస్,ఏర్పాట్లను ఆదివారం జిల్లా ఎస్పీ నితికా పంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరేడ్ కమాండర్తో పాటు సాధన చేస్తున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి, పలు కీలక సూచనలు చేశారు.
పరేడ్‌లో క్రమశిక్షణ, సమన్వయం, సమయపాలన అత్యంత ముఖ్యమని, ప్రతి ఒక్కరూ పూర్తి నిబద్ధతతో సాధన చేయాలని సూచిం చారు. గణతంత్ర దినోత్సవం దేశానికి గర్వకారణమైన రోజు కావడంతో, పరేడ్లో పోలీస్ శాఖ ప్రతిష్ట స్పష్టంగా కనిపించేలా ఉండాలని అన్నారు. అలాగే యూనిఫాం శుభ్రత, అడుగుల సమతు ల్యత, కమాండ్లపై ఏకాగ్రతతో స్పందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. రేపటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నాలుగు ప్లాటూన్లు పరేడ్లో పాల్గొననున్నట్లు ఎస్పీ తెలిపారు.