26-01-2026 01:34:45 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 25(విజయక్రాంతి): జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత, జర్నలిస్ట్ చిలుకూరి రాధాకృష్ణ చారికి మహానంది పురస్కారం లభించింది. తెలుగు ఇండియన్ కల్చర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ కాళోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు వెలుగు సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా సాహిత్య, పత్రికా సేవ రంగాల్లో రాధాకృష్ణ చారి అందించిన విశిష్ట సేవలను గుర్తించి మహానంది పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ప్రముఖ హాస్య నటుడు ఆర్.ఎస్. నంద చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేసి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.