calender_icon.png 14 November, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యులకు సేవాభావం ఉన్నప్పుడే వృత్తిలో రాణిస్తారు

14-11-2025 01:34:50 AM

ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

జగిత్యాల అర్బన్,నవంబర్ 13 (విజయ క్రాంతి): వైద్యులకు సేవా భావం ఉన్నపుడే వైద్య వృత్తిలో రాణిస్తారని జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్, వైట్ కోట్ సెర్మోని కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి సంవత్సరంలో ఉత్తమ పలితాలు సాధించి డిస్టింక్షన్ లో పాసైన విద్యార్థులను ప్రశంసా పత్రాలు,మెడల్స్ అందజేసి సత్కరించారు.

అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ని కళాశాల యాజమాన్యం మెమెంటో అందజేసి శాలువా తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.సునీల్, సూపరిండెంట్ డా.కృష్ణ మూర్తి,వైస్ ప్రిన్సిపాల్ అర్చన,ప్రొఫెసర్స్, హెచ్ ఓ డి లు మెడికల్ విద్యార్థులు తల్లి దండ్రులు పాల్గొన్నారు.ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సహకారం తోరు.40 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదలతో మెడికల్ కాలేజీ పనులు త్వరిత గతిన జరుగుతున్నాయన్నారు.

మెడికల్ కళాశాల లో సమస్యలు ఉంటే మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.మెడికల్ విద్యాభ్యాసం లో ఫలితాలతో పాటు క్యారెక్టర్ కూడా ముఖ్యం అని,వైద్యులకు సేవా భావం ఉన్నపుడే వైద్య వృత్తిలో రాణిస్తారన్నారు.మెడికల్ అభ్యాసం తో పాటు వైద్య రంగం లో నూతన సాంకేతికత పై కూడా పట్టు ఉండాలన్నారు.

ఎన్‌ఎంసి ప్రకారం అన్ని రూల్స్ పాటిస్తూ ఉండడం వల్ల నే జగిత్యాల మెడికల్ కళాశాల కు ఆమోదం లభించిందన్నారు.యోగా మెడిటేషన్ అదనపు కార్యక్రమాలు మెడికల్ కాలేజీలో చేపట్టడం అభినందనీయమన్నారు. మొదటి సంవత్సరంలోఉత్తమ పలితాలు సాధించిన విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.