14-11-2025 01:35:49 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, నవంబర్ 13: నకిరేకల్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం తెలిపారు. గురువారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 04,13,14 వార్డులో 1 కోటి 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సి.సి రోడ్డు %ఞ% డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి పది లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది మరో 15 కోట్ల కోసం ప్రభుత్వంకు ప్రతిపాధనలు పంపించడం జరిగింది నకిరేకల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
పట్టణంలో త్వరలో అరులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజురు చేస్తామని ఆయన తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని ఆయన తెలిపారు.ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బీజేపీ లు ఒప్పందం చేసుకొని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజార్ల శంబయ్య , స్థానిక మున్సిపాలిటీ చెర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, పిఏసియస్ చెర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ కమిషనర్ రంజిత్ కుమార్, ఫన్నాల రాఘవరెడ్డి, సకినాల రవి, లింగాల వెంకన్న,స్థానిక కౌన్సిలర్లు నాయకులు, మురారి శెట్టి కృష్ణమూర్తి , గాజుల సుకన్య , మట్టిపల్లి వీరు రాచకొండ సునీల్, యాసరపు వెంకన్న, ఘర్శకోటిసైదులు,తదితరులు పాల్గొన్నారు..
గౌడ కులస్థుల సంక్షేమానికి కృషి ..
గౌడ కులస్థుల సంక్షేమానికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.గురువారం నకిరేకల్ పట్టణంలో గౌడ కులస్థుల ఆధ్వర్యంలో రూ. 30.00 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫంక్షన్ హల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు..ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చెర్మన్ చెవుగోని రజిత - శ్రీనివాస్, పిఏసియస్ చెర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, గౌడ సంఘం చెర్మన్ కొండ వెంకన్న, స్థానిక కౌన్సిలర్లు,గౌడ కులస్థులు తదితరులు పాల్గొన్నారు..