20-05-2025 01:08:34 AM
ఎమ్మెల్యే సబితా రెడ్డి
కందుకూరు, మే 19: పూర్వికులు గ్రామాలలో నిర్మించిన ఆలయాలను పరిరక్షించుకుంటూ భక్తి భావాలను ప్రజలు అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సబితా రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం లో ని పులిమామిడి గ్రామంలో శ్రీ శ్రీ బొడ్రాయి రేణుక ఎల్లమ్మ దేవి,శివ పరివారం, రామ పరివారం, ఆంజనేయస్వామి, నవగ్రహాలు,జీవ,ధ్వజస్తంభం,దీప స్తంభాల పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఉత్సవాలకు ఎమ్మెల్యే పట్లొళ్ల సబితా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాలలో ఆలయాల ఆలనా పాలనపై దృష్టి సారించాలని ఆమె కోరారు.ధూప దీప నైవేద్యాలకు దేవతామూర్తులు నోచుకోకుండా ఉంటే గ్రామాలకు ఎంతో అరిష్టం పడుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు దేవాలయాలకు వెళ్లి నిత్యం పూజలు చేయాలని ఆమె సూచించారు.
కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనేగౌని అంజయ్య గౌడ్, మాజీ వైస్ ఎంపిపి సంధ్య దామోదర్ గౌడ్,మహేశ్వరం నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ కార్యదర్శి సామ మహేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు సామ ప్రకాష్ రెడ్డి, పులి మామిడి మాజీ సర్పం పాండుగౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు,గ్రామస్తులు పాల్గొన్నారు.