calender_icon.png 8 October, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాల్మీకి ధర్మ మార్గాన్ని ప్రతిఒక్కరూ అనుసరించాలి

08-10-2025 12:09:38 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : సంస్కృత భాషలో తొలి కావ్యమైన రామాయణాన్ని రచించిన  మహర్షి వాల్మీకి ఆదికవి అని, ఆయన చూపిన ధర్మ మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మహర్షి వాల్మీకి దొంగ నుండి ఆదికవిగా మారి సమాజానికి ధర్మాన్ని చాటి చెప్పారన్నారు.  శ్రీరాముని జీవిత చరిత్రను, ధర్మ మార్గాన్ని తన రామాయణం ద్వారా సమాజానికి తెలియజేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మహర్షి వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. ఎలాంటి చదువురాని వాల్మీకి తను మహర్షిగా మారి రచించిన రామాయణంలోని భాష ఎంతో సామర్థ్యాన్ని కలిగి ఉందని, ఆనాటి భాషా సామర్ధ్యాలను ఇప్పటికీ మనం వాడుతున్నామన్నారు.

ఏ భాష అయినా విద్యార్థులు పూర్తిస్థాయిలో ఉపయోగించేలా మనం తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆదనపు కలెక్టర్ కె. సీతారామారావు, పలువురు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వాల్మీకి చరిత్ర చిరస్మరణీయం..

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),అక్టోబర్07: ప్రపంచం ఉన్నంతవరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంపీడీఓ గోపీ అన్నారు. మండల కేంద్రం అర్వపల్లిలోని ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాల్లో మంగళవారం ఆదికవి వాల్మీకీ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తన గురువు బోధనల ద్వారా ప్రేరణ పొంది, పశ్చాత్తాపంతో సద్గుణ మార్గం వైపు మల్లి, ఆత్మ శోధన ద్వారా మహానుభావుడిగా మారి మనందరికీ ఆదర్శప్రాయమైన రామాయణం అనే గ్రంధాన్ని రచించాడన్నారు. వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి సేవ చేయాలని సూచించారు.ఆయా కార్యక్రమాల్లో గిర్ధవార్లు జలంధర్ రావు, వెంకట్ రెడ్డి, ప్రసన్న, సూపరిండెంట్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ నరసింహారాజు, జూనియర్ అసిస్టెంట్ శిల్పిక, సాయిప్రదీప్, టీఏలతో పాటు ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

వలిగొండ మండల కేంద్రంలో..

వలిగొండ, అక్టోబర్ 7 (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో  జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి మరియు కొమరం భీమ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జలంధర్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శ పురుషుడు శ్రీరాముని యొక్క జీవిత చరిత్రను కండ్లకు కట్టినట్లు రచించిన గొప్ప మహర్షి వాల్మీకి అని అన్నారు. అదేవిధంగా కొమరం భీమ్ గొప్ప పోరాట యోధుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్, రాధా కుమార్, సంయుద్దీన్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కట్టంగూరు మండల పరిషత్ కార్యాలయంలో..

నకిరేకల్‌అక్టోబర్7(విజయక్రాంతి) : శ్రీ మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం  కట్టంగూరు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాల్మికి చిత్రపటానికి కట్టంగూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి.జ్ఞాన ప్రకాష్ రావు  పూలమాలలు  నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కట్టంగూర్ మండల పంచాయతీ అధికారి  కల్లెపురం స్వరూప రాణి , సూపరెండెంట్  చింతమల్ల చలపతి , కట్టంగూరు మండల ఏపీఓ  కడెం రామ్మోహన్ , సీనియర్ అసిస్టెంట్  మద్ది సులోచన , ఏ.పి.యం రాములు,సి సి లు,కంప్యూటర్ ఆపరేటర్లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.