03-07-2025 10:36:24 PM
మంథని నియోజకవర్గం ఇంచార్జీ చందుపట్ల సునీల్ రెడ్డి..
మంథని (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీజేపీ ప్రథమ స్థానంలో పిలవాలని మంథని నియోజకవర్గం ఇంచార్జీ చంద్రుపట్ల సునీల్ రెడ్డి(Constituency In-charge Chandrupatla Sunil Reddy) అన్నారు. గురువారం మంథని పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర శాఖ సూచన మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ఆదేశాల మేరకు మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సబ్బాని సంతోష్ పటిష్టమైన పట్టణ కమిటీ నిర్మాణం చేపట్టారు.
ఈ కమిటీలో పట్టణ ఉపాధ్యక్షులుగా ఆకుల అరుణ్, దాసరి శ్రవణ్, బొల్లంపల్లి లక్ష్మణ్, శ్రీరామోజు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శులుగా సామల అశోక్, ఎడ్ల సాగర్ కార్యదర్శులుగా పార్వతి విష్ణు, మాచీడి శ్రీధర్, వేల్పుల సత్యం, దూడపాక రోజా, కోశాధికారిగా వొడ్నాల శ్రీనివాస్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించి నిస్వార్ధంతో నిజాయితీతో శ్రమించి మంథని పట్టణంలో ప్రతి వార్డులో, ప్రతి బూతులలో పార్టీ ని బలపరచడమే లక్ష్యంగా పని చేస్తామని వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా ప్రతి కమిటీ సభ్యుడికి సునీల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మంథని నియోజక వర్గంలో బిజెపి జెండాను ఎగరవేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.