03-07-2025 10:29:59 PM
డాక్టర్ యోషిత...
వాజేడు (విజయక్రాంతి): గర్భం దాల్చిన దగ్గర నుండి 280 రోజులు పూర్తయ్యే వరకు ప్రతి గర్భవతి పౌష్టికాహారం తీసుకోవాలని పేరూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులు యోషిత(Doctors Yoshitha) తెలిపారు. పేరూరు వైద్యశాలలో బుధవారం గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జన్మనిచ్చే తల్లి జన్మించిన శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకుంటూ తగిన పద్ధతిలో వ్యాయామం చేయాలని తెలిపారు. 280 రోజులకు ముందు జన్మించిన శిశువు అపరిపక్వతతో అనారోగ్యంతో జన్మించే అవకాశాలు ఉంటాయని దీనికి కారణం తగినంత రక్తం శరీరంలో లేకపోవడమేనని అన్నారు. 9 నెలలు నిండే అంతవరకు కనీసం 11 గ్రాముల రక్తం ఉండాలని తెలిపారు. రక్తహీనతతో ఉన్న గర్భవతులు ఐరన్, సుక్రోజ్ ఇంజక్షన్లను ప్రతి రెండు రోజులకోసారి వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ రమా, అనూష ఏఎన్ఎం శకుంతల , సుమలత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.