27-09-2025 12:27:03 AM
జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఎదగాలని సంకల్పం మీలో ఉన్నప్పుడు మీ ఎదుగుదలకు ప్రతి ఒక్కరు సహకరిస్తారని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. హిటాచీ ఎనర్జీ స్కాలర్షిప్లు జేపీఎన్సీఈ విద్యార్థినులకు జిల్లా ఎస్పీ తన చాంబర్లో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూహిటాచీ ఎనర్జీ సంస్థ అందించే ప్రతిష్టాత్మక స్కాలర్షిప్లకు జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ శాఖకు చెందిన ఏడు మంది విద్యార్థినులు ఎంపిక కావడం సంతోషకరమన్నారు.
ఈ స్కాలర్షిప్లో భాగంగా హిటాచీ వారి నుండి ల్యాప్టాప్లు అందించబడ్డాయని మునుముందు మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె.ఎస్. రవి కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. కృష్ణమూర్తి , పరీక్షల నియంత్రణాధికారి కె. సందీప్ కుమార్, ఈఈఈ శాఖాధ్యక్షుడు చి. వెం కటేష్ , అధ్యాపకులు ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజలతో మర్యాద, ఓర్పుతో ప్రవర్తించాలి
జిల్లా ఎస్పీ డి. జానకి
కోయిల్ కొండ,సెప్టెంబర్ 26: ప్రజల భద్రతే మన బాధ్యతనే విషయాన్ని ప్రతిక్షణం గుర్తించుకుని ప్రజలకు సేవలు అందించాలని జిల్లా ఎస్విడి జానకి అన్నారు. శుక్రవారం కోయిలకొండ మండలం పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేసి న్యాయం జరిగే లా చూడాలని, ప్రజలతో మర్యాద, ఓర్పుతో ప్రవర్తించాలి పోలీసుప్రజల మధ్య నమ్మకం పెం పొందించాలన్నారు.
చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని,సైబర్ క్రైమ్ ముప్పులపై అవగాహన కల్పిస్తూ, పిల్లలు, తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించేలా ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. స్టేషన్ పరిధిలో నేరాలు, గాంబ్లింగ్, గుట్కా, గంజాయి వంటి అక్రమ కా ర్యకలాపాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.రాత్రి పహారాలు, బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, స్టేషన్ శుభ్రత, రికార్డుల నిర్వహణ పద్ధతి, సిబ్బంది క్రమ శిక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, కోయిల్కొండ ఎస్త్స్ర తిరుపాజి, పోలీస్ స్టేషన్ సిబ్బందిపాల్గొన్నారు.