03-01-2026 12:22:28 AM
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, జనవరి 2: గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో చేపట్టిన బస్తీ నిద్ర కార్యక్రమానికి రెండో రోజు శుక్రవారం ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఉస్మాన్‌సాయి విఠోబా దేవాలయ ప్రాంగణంలోని బస్తీ నిద్ర కుటీర కేంద్రంలో శ్రీనివాస్ యాదవ్ వాలంటరీలకు, దిశా నిర్దేశం చేశారు. అనంతరం, గౌలిగూడ, ఉస్మాన్ సాయి, సీబీఎస్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ విజ్ఞాపాలను గడ్డం శ్రీనివాస్ యాదవ్‌కు అందజేశారు.
కొన్ని సంవత్సరాల నుంచి, అద్దె ఇంట్లో ఉంటూ, సొంత ఇల్లు లేక, అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు ఎలాగైనా, ప్రభుత్వం నుంచి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఇప్పించే విధంగా తమ వంతు కృషి చేయాలని బస్తీవాసులు విజ్ఞప్తి చేశారు. వృద్ధాప్య పింఛన్లు ప్రభుత్వం ఇచ్చేలా, మా పిల్లలకు, ఉచిత విద్యను అందించే విధంగా, తమ విద్యా సంస్థల్లో, ఫ్రీ ఎడ్యుకేషన్ అందజేయాలని కోరారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను, క్షుణ్ణంగా పరిశీలించి, వారికి సాధ్యమైనంత త్వరలో న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని గడ్డం శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, మహేష్, శ్రీధర్, రఫత్, జగదీష్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.