25-11-2025 12:58:37 AM
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో నాలుగు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు హర్షం వ్యక్తం చేస్తూ సో మవారం ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రూ.10,034 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులు ఉత్తతర తెలంగాణ జిల్లాలకు మెరుగైన రవాణా సౌక ర్యాలు అందించడంతోపాటు, సామాజిక ఆర్థికాభివృద్ధికి దోహదపడనున్నాయని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2015 వరకు తెలంగాణలో 2,500 కి.మీ. మేర జాతీయ రహదారుల ని ర్మాణం జరిగితే గత పదేళ్లలో తెలంగాణలో 5 వేల కి.మీ. కుపైగా జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని తెలిపారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం లో రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఎన్‌హెచ్ మహబూబ్‌నగర్ (80కి.మీ.), ఎన్ హెచ్‌భ ఆర్మూర్ (64 కి.మీ.), ఎన్‌హెచ్ జగిత్యాల (68 కి.మీ.), ఎన్‌హెచ్ జగిత్యాల (59 కి.మీ.) రహదారుల విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు.