25-11-2025 12:57:10 AM
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శికి మంత్రి పొన్నం ప్రభాకర్ వినతి
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి):తెలంగాణలోని గౌరవెల్లి సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శి తన్మ యి కుమార్‌ను రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సెక్రెటరీ కోఆర్డినేషన్ డా.గౌరవ్ ఉప్పల్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఢిల్లీలో తన్మయి కుమార్‌ను కలిశారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన అనుమతులపై చర్చించారు. సుప్రీంకోర్టు ధర్మా సనం మే 2025లో ఇచ్చిన ‘వనశక్తి’ తీర్పును ఇటీవల వెనక్కి తీసుకుందని, దీనిపై న్యాయసలహా తీసుకొని అనుమతుల మంజూరు చేస్తామని తన్మయి కుమా ర్ చెప్పినట్టు మంత్రి వివరించారు.
ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేస్తే ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే అవకాశాలు పెరుగుతాయని కార్యదర్శికి వివరించినట్టు మంత్రి తెలిపారు. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ విదేశాల్లో ఉన్న కారణంగా తన్మయికుమార్‌ను కలిసి ప్రాజెక్టుల అనుమతుల గురించి చర్చించినట్టు చెప్పారు.