22-12-2025 11:25:52 PM
హనుమకొండ,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉన్నత పాఠశాల,జులైవాడలో ప్రముఖ గణిత భారతీయ శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని సోమవారం గణిత దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు గణితం పై రూపొందించిన 45 నమూనాలను ప్రదర్శించారు. అనంతరం గణితంపై నిర్వహించిన క్విజ్ పోటీలో విద్యార్థులు పాల్గొన్నారు.
ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడారి భాస్కర్ రెడ్డి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం గణిత ప్రదర్శనను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ నిత్యజీవితంలో గణితం ప్రాముఖ్యతను సంతరించుకున్నదని, గణితంలో నిష్ణాతులయితే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత పదవులను పొందుతారన్నారు.ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు గజ్వేల్లి పూర్ణచందర్,నల్ల అమితా దేవి, పాఠశాల, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.