calender_icon.png 23 December, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువుదీరిన పాలక వర్గం..

22-12-2025 11:13:37 PM

- అట్టహాసంగా ప్రమాణస్వీకారోత్సవం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో నూతనంగా పాలనా పగ్గాలు చేపట్టిన సర్పంచులు, ఉపసర్పంచులు అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. అయా గ్రామ పంచాయతీల కార్యాలయాల్లో సోమవారం ప్రత్యేక అధికారులు కొత్త సర్పంచులతోటి ప్రమాణ స్వీకారం చేపించారు. బెల్లంపల్లి, నెన్నెల ,కన్నెపల్లి, వేమనపల్లి, తాండూర్, కాసిపేట, భీమినీ మండలాల్లో నూతనంగా గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచుల ప్రమాణస్వీకారం చేసి కొలువుదీ రారు. బెల్లంపల్లి మండలంలోని 17 గ్రామపంచాయతీల్లో సర్పంచులు ఉపసర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు.

కన్నాల గ్రామపంచాయతీ సర్పంచ్ గా నాతరి మల్లమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. స్పెషల్ ఆఫీసర్ రక్షిత, సెక్రటరీ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేపించారు. నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసి నా నాతరి మల్లమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే గడ్డం వినోద్, నూతన పాలకవర్గం సహాయ సహకారాలతో  గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి నాతర స్వామి, మాజీ జెడ్పిటిసి కారుకకూరి రామచందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూరిబాబు, మున్సిపల్ మాజీ  కౌన్సిలర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.