22-12-2025 11:28:36 PM
తరిగొప్పుల,(విజయక్రాంతి): తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. డిసెంబర్ 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కావటి సుధాకర్, ఉప సర్పంచ్ నీల సంపత్, ఎనిమిది మంది వార్డు మెంబర్లు సోమవారం జరిగిన ప్రమాణ స్వీకారమహోత్సవం లో గ్రామ కార్యదర్శి రవీందర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గా ఎన్నికైన సుధాకర్ మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించినందుకు అబ్దుల్ నాగారం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అబ్దుల్ నాగారం గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ పంచాయతీ,సిబ్బంది, ఖాత సందీప్, పరుశరాములు, విజయలక్ష్మి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.